
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులుతో పాటూ పరీక్షల ఫలితాలు విడుదల కావడంతో భక్తులు కొండకు క్యూ కట్టారు. తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 36 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు కిక్కిరిసిపోయి.. దర్శనం కోసం మూడు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. శిలాతోరణం వరకు రెండు కిలోమీటర్ల పొడవున క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. టీటీడీ ఎప్పటికప్పుడు భక్తుల రద్దీ, అక్కడ ఏర్పాట్లపై పర్యవేక్షిస్తోంది. భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాలను అందిస్తున్నారు. మరోవైపు బుధవారం తిరుమల శ్రీవారిని 77,436 మంది భక్తులు దర్శించుకున్నారు. 38,980 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీకి రూ. 3.77 కోట్లు ఆదాయం వచ్చింది.
Read Also : దారుణం.. యువకుడి ప్రాణం తీసిన ఐపీఎల్ బెట్టింగ్
వేసవి సెలవుల రద్దీ పెరగడంతో టీటీడీ తగిన ఏర్పాట్లు చేసింది. జులై 15 వరకు ఈ రద్దీ కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. క్యూ లైన్లు, కంపార్ట్‌మెంట్‌లు, కాంప్లెక్స్‌లలో భక్తులకు తాగు నీరు, అన్నప్రసాదం అందించేలా ఏర్పాట్లు చేశారు. రద్దీకి తగినట్లుగా లడ్డూలను కూడా నిల్వ ఉంచారు. మరుగుదొడ్లను కూడా శుభ్రంగా ఉంచుతున్నారు. అలాగే కళ్యాణకట్టతో పాటుగా సీఆర్వో, పీఏసీల వద్ద సమస్యలు లేకుండా చూస్తున్నారు. అవసరమైన చోట అదనపు సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే శ్రీవారి సేవకులను కూడా సిద్ధం చేసుకున్నారు. మరోవైపు తిరుమలను ప్లాస్టిక్ రహిత ఆధ్యాత్మిక క్షేత్రంగా మార్చేందుకు నిర్వహించిన శుద్ధ తిరుమల సుందర తిరుమల కార్యక్రమాన్ని టీటీడీ అధికారులు, ఉద్యోగులు, ఇతర విభాగాల సిబ్బంది విజయవంతం చేశారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అభినందించారు.
Also Read : బీఆర్ఎస్‌కు ఎన్నికల సంఘం నుంచి గుడ్‌న్యూస్… కారు గుర్తుతో పోలీవున్న గుర్తుల తొలగింపు
రాబోయే రోజుల్లో ప్రభుత్వ విభాగాల్లో పనిచేసేవారు, ఇతరులు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి ముందుకు వస్తే వారి సేవలు వినియోగించుకోవాలని సూచనలు చేశారు. తిరుమలతో పాటు నడక దారుల్లోని దుకాణదారులకు పారిశుద్ధ్య నిర్వహణపై అవగాహన కల్పించాలని ఆదేశించారు ఈవో ధర్మారెడ్డి. ట్యాక్సీ , ప్రైవేట్ వాహనాలు , ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమలకు వెళ్ళే భక్తులకు ప్లాస్టిక్ ఉత్పత్తుల నిషేధంపై అవగాహన కల్పించడానికి పోలీస్, ఆర్టీసీ అధికారుల సహకారం తీసుకోవాలన్నారు. తిరుమలతో పాటు, ఘాట్ రోడ్లు, నడకదారుల్లో ప్లాస్టిక్ ఉత్పత్తులను వాడకుండా భక్తులకు అవగాహన కల్పించేలా దుకాణదారులకు కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. విరివిగా చెత్త బుట్టలు ఏర్పాటు చేసి వ్యర్థపదార్థాలను అందులోనే వేసేలా అవగాహన కల్పించాలన్నారు.
ఇవి కూడా చదవండి :
- తిరిగి కాంగ్రెస్ లోకి రాజగోపాల్ రెడ్డి – రేవంత్ కు షరతు..!?
- ‘4 నెలలుగా అదే మాట’.. సస్పెన్షన్ ఎత్తివేతపై రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
- బావిలో శవాలై తేలిన భార్యాభర్తలు.. అనాథలైన ఏడేళ్లలోపు ఇద్దరు చిన్నారులు
- బీఆర్ఎస్ కార్యకర్త ఫిర్యాదు… బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో వైయస్ షర్మిలపై కేసు నమోదు
- ఎన్నికల బరిలోకి బడా నేత వారసుడు… గ్రాండ్ ఎంట్రీకి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్న సీనియర్ నేత
One Comment