
క్రైమ్ మిర్రర్, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : భార్య భర్తల మద్య చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు సర్వసాధారం. కలతలు లేని కాపురాలు ఉండవని అంటారు. ఎంతటి గొడవలైనా కూర్చుని మాట్లాడుకుంటే సమసిపోతాయి. కానీ కొందరు దంపతులు విచక్షణ కోల్పోతున్నారు. చిన్న చిన్న వాటికి గొడవపడి వాటిని పెద్దవి చేసుకుంటున్నారు. కొన్ని సార్లు ఆ గొడవలు ప్రాణాలు తీసుకునేంత, తీసేంత వరకు దారి తీస్తున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. మద్యం తాగొద్దని భర్తను హెచ్చరించిన భార్యకు ఓ వ్యక్తి కరెంట్ షాక్ పెట్టి చంపేశాడు. అనంతరం ఏమీ తెలియనట్లు నటించాడు. తన భార్య ప్రమాదవాశాత్తు చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు.
Read Also : భద్రాచలంలో పర్యటించిన గవర్నర్ తమిళిసై… ఆదివాసీలతో ప్రత్యేక సమావేశం
వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా కొందుర్గు గ్రామానికి చెందిన మమత (30) అదే గ్రామానికి చెందిన సున్నాల యాదయ్యను 2008లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కూతురు, ఇద్దరు కుమారులు. ఆటో నడుపుతూ జీవనం సాగించే యాదయ్య.. వచ్చిన డబ్బులతో నిత్యం తాగుతూ కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు. కుటుంబ పోషణ భారంగా మారటంతో మమత కొందుర్గు శివారులోని ఓ పరిశ్రమలో రోజువారీ కూలి పనులు చేస్తూ సంసారం నెట్టుకొస్తోంది. ఈక్రమంలో యాదయ్య ఎప్పటిలాగే సోమవారం సాయంత్రం మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ప్రతిరోజూ ఇలా తాగివస్తే సంసారం ఎలా సాగుతుందని నిలదీసింది. దీంతో కోపోద్రిక్తుడైన యాదయ్య భార్యతో గొడవపడి బయటికి వెళ్లిపోయాడు. రాత్రి భోజనం చేశాక మమత పిల్లలతో కలిసి నిద్రపోయింది. అర్ధరాత్రి ఇంటికొచ్చిన యాదయ్య భార్యపై కోపంతో ఆమెకు కరెంట్ షాక్ పెట్టి చంపేశాడు. అనంతరం ఏమీ తెలియనట్లు నటించాడు.
Also Read : ‘బలగం’ మొగిలయ్య దంపతులకు దళితబంధు… అండగా నిలిచిన సర్కార్
ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌తో చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. మమత మృతిపై ఆమె పుట్టింటివారు అనుమానం వ్యక్తం చేశారు. మృతురాలు తండ్రి వెంకటయ్య స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త యాదయ్యను అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో తానే కరెంట్ షాక్ పెట్టి చంపినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఏడు అడుగులు వేసి నూరేళ్లు తోడుగా ఉంటానని మాటిచ్చిన భర్త భార్యకు కరెంట్ షాక్ పెట్టి చంపేయటంతో గ్రామంలో విషాదం అలుముకుంది. జీవితాంతం తోడుగా ఉంటానని అగ్ని సాక్షిగా మాట ఇచ్చిన భర్తె ఇలా క్రూరంగా చంపేయటం పట్ల స్థానికులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- శబరిమలలో అపచారం.. పొన్నాంబళమేడుపై అక్రమంగా పూజలు
- ఆగ్రా నుంచి వచ్చిన వ్యక్తికి ‘ఆల్కహాల్ అలర్జీ’ పాజిటివ్.. తెలంగాణలో ఇదే తొలి కేసు..
- ఎన్నికల బరిలోకి బడా నేత వారసుడు… గ్రాండ్ ఎంట్రీకి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్న సీనియర్ నేత
- హైదరాబాద్ ఉగ్ర కుట్ర వెనుక మతమార్పిడి… ఇస్లాంలోకి హిందూ యువకులు
- పార్టీ విలీనంపై వైఎస్ షర్మిల క్లారిటీ… 44 స్థానాలలో తమ పార్టీ ప్రభావం ఉంటుందని వ్యాఖ్య
2 Comments