
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ప్రపంచ పైకప్పుగా గుర్తింపు పొందిన టిబెట్ స్వయంప్రతిపత్తి ప్రాంతం. ఈ ప్రాంతంపై తమకు సర్వాధికారాలు ఉన్నాయని చైనా వాదిస్తోంది. అంతేకాదు, 1951లో వేలాది మంది సైనికులను పంపి టిబెట్‌ను ఆక్రమించుకుంది. దశాబ్దాలుగా దురాగతాలను సాగిస్తోన్న చైనా.. టిబెట్ పౌరుల నుంచి బలవంతంగా డీఎన్‌ఏ నమూనాలను సేకరిస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే లక్షలాది మంది నమూనాలను సేకరించినట్లు తెలుస్తోంది. టిబెట్ పౌరులను నియంత్రించడం, వారిని పర్యవేక్షణ కోసమే డ్రాగన్ ఇటువంటి చర్యలకు తెగబడుతోందనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా, ఈ అంశంపై అమెరికా విదేశాంగశాఖ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Read Also : తమిళనాడులో కల్తీ మద్యం తాగి 11 మంది మృతి… తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్టాలిన్
టిబెట్ స్వతంత్ర ప్రాంతంలో ఆరేళ్ల వ్యవధిలో సుమారు 9.2లక్షల నుంచి 12లక్షల మంది పౌరుల నుంచి డీఎన్‌ఏ నమూనాలను చైనా పోలీసులు సేకరించినట్లు గతేడాది సెప్టెంబరులో సిటిజెన్ ల్యాబ్ నివేదిక వెల్లడించింది. అక్కడ మూడో వంతు ప్రజల నుంచి డీఎన్ఏ నమూనా సేకరించినట్లు అంచనా. తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల అనుమతి లేకుండా టిబెట్ పౌరుల డీఎన్‌ఏలను ఒక క్రమపద్ధతిలో సేకరిస్తున్నట్లు హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదిక ఇటీవల తెలిపింది. రెండు రోజుల కిందట జరిగిన వార్షిక ఫ్రీడమ్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా విదేశాంగమంత్రి ఆంటోని బ్లింకెన్ మాట్లాడుతూ.. ‘భారీ స్థాయిలో టిబెట్ పౌరుల డీఎన్‌ఏలను చైనా సేకరిస్తోందని నివేదికలు అందుతున్నాయి. అక్కడి పౌరులపై నియంత్రణ, పర్యవేక్షణ కోసమే చైనా ఈ తరహా చర్యలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది’ అని వ్యాఖ్యానించారు.
Also Read : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం బ్రేక్ ఫాస్ట్
మానవ జన్యు సమాచారం సేకరణ మానవ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని చెప్పారు. మరోవైపు, బ్లింకెన్ వ్యాఖ్యలను అంతర్జాతీయ టిబెట్ ప్రచార సంస్థ స్వాగతించింది. ‘క్రూరమైన ఆక్రమణలో భాగంగా టిబెట్‌ను సామాజిక నియంత్రణ పద్ధతులకు ప్రయోగశాలగా ఉపయోగించుకుంది. ఇందులో సామూహిక డీఎన్ఏ సేకరణ ఈ భయంకరమైన ప్రచారం ఉంది’ అని ఐసీటీ వ్యాఖ్యానించింది. ‘టిబెట్, అక్కడ పౌరులను చైనా నిరంకుశ పాలన నుంచి రక్షించడానికి ఉత్తమ మార్గం అక్రమ ఆక్రమణకు శాంతియుత పరిష్కారం కోసం ఒత్తిడి చేయడం.. ప్రస్తుతం ఉన్న టిబెట్-చైనా సంఘర్షణ చట్టానికి ద్వైపాక్షిక తీర్మానాన్ని అమెరికా కాంగ్రెస్ ఉభయసభలు ఆమోదించడం ద్వారా నెరవేర్చగలదు’ అని పేర్కొంది.
ఇవి కూడా చదవండి :
- ఈడీ విచారణకు చికోటి ప్రవీణ్… థాయ్‌లాండ్‌లో పట్టుబడ్డ నగుదుపై ఈడీ ఆరా
- నీరా కేఫ్ గౌడ కులస్థుల ఆత్మగౌరవానికి ప్రతీక… మంత్రి శ్రీనివాస్ గౌడ్
- ప్రపంచకప్ లో భారత్ -పాక్ హై ఓల్టేజ్ మ్యాచ్: హైదరాబాద్ వేదికగా, కానీ..!?
- హైదరాబాద్ రానున్న సోనియా గాంధీ: ప్రతిష్టాత్మక భవన నిర్మాణానికి శంకుస్థాపన
- ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉంది… మోదీ, అమిత్ షాలకు రాజాసింగ్ విజ్ఞప్తి
One Comment