
క్రైమ్ మిర్రర్, కరీంనగర్ ప్రతినిధి : మరికాసేపట్లో పెళ్లి. వివాహానికి వచ్చిన బంధువులు, అతిథులతో కల్యాణ మండపం కళకళలాడుతోంది. బాజాభజంత్రీలు, సన్నాయి వాయిద్యాలతో పెళ్లి వేదిక సందడిగా మారింది. అప్పటికే వరుడు, అతడి తరపు బంధువులు కల్యాణ మండపానికి చేరుకున్నారు. అంతలోనే ట్విస్ట్ చోటు చేసుకుంది. సినిమాల్లో రోటీన్‌గా జరిగే తంతే అక్కడా చోటు జరిగింది. పెళ్లి కూతురు తరపు వాళ్లు అటు ఇటూ తిరుగుతున్నారు. ఒకరితో ఒకరు గుసగుసలాడుతూ ఆందోళనతో కనిపించారు. ఏం జరిగిందని ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది.
Read Also : ‘తెలంగాణ ఉద్యమ సమిధ’ కానిస్టేబుల్ కిష్టయ్య కూతురు డాక్టరైంది…
అక్క భర్తతో పెళ్లి కూతురు జంప్ అయినట్లు తెలిసింది. దీంతో పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా కన్నాపూర్‌లో చోటు చేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే.. కన్నాపూర్‌కు చెందిన యువతికి, అదే జిల్లా లంబాడిపెళ్లికి చెందిన ఓ యువకుడికి పెళ్లి నిశ్చయమైంది. ఆదివారం ఉదయం బంధు, మిత్రుల సమక్షంలో పెళ్లితంతు జరగాల్సి ఉంది. వరుడు, వారి తరపు బంధువులు కల్యాణ మండపానికి చేరుకొని పెళ్లి తంతు ప్రారంభించారు. పెళ్లి ముహుర్తానికి కొన్ని నిమిషాల ముందు పెళ్లి కూతురు కనిపించలేదు.
Also Read : ప్రియాంకగాంధీ పర్యటనతో టీ కాంగ్రెస్‌లో కొత్త జోష్.. యూత్ డిక్లరేషన్ ప్రకటన
దీంతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికారు. తెలిసిన వారికి ఫోన్ చేసి అడిగారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అదే సమయంలో పెళ్లి కూతురు అక్క భర్త కూడా కనిపించకుండా పోయాడు. అతడికి ఫోన్ చేయగా.. స్పందన కరువైంది. కాసేపటికే పెళ్లి కూతురు తన అక్క భర్తతో పరారైందన్న వార్త తెలిసింది. ఆ విషయం తెలుసుకున్న వెంటనే పెళ్లి కూతురి అక్కతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు షాక్ అయ్యారు. పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోగా.. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
ఇవి కూడా చదవండి :
- ‘కొడుక్కి భారమయ్యాం..ఇక బ్రతకలేం’… పురుగులమందు తాగి వృద్ధ దంపతుల ఆత్మహత్య
- ‘ప్రజాకోర్టులో శిక్ష తప్పదు’.. సర్పంచులకు మావోయిస్టుల హెచ్చరిక
- టెక్సాస్‌లో కాల్పులు.. రంగారెడ్డి జిల్లా కోర్డు జడ్జి కూతరు మృతి
- ‘ఆ భావన పిల్లలకు ఏ మాత్రం మంచిది కాదు’.. సజ్జనార్ ఎమోషనల్ ట్వీట్
- రేవంత్ రెడ్డికి తలనొప్పిగా ఆర్మూర్… మాకొద్దు అంటున్న కాంగ్రెస్ నేతలు
One Comment