
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : సిద్దిపేట జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో విషాదకర ఘటన జరిగింది. 90 ఏళ్ల వెంకటయ్య అనే వృద్ధుడు ఆత్మాహుతి చేసుకోవడం విషాదకరంగా మారింది. తన చితి తానే పేర్చుకుని నిప్పంటించుకుని వెంకటయ్య ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హుస్నాబాద్ మండలం పొట్టపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య గురువారం మధ్యాహ్నం తన గ్రామ శివారులోని ఎల్లమ్మగుట్ట వద్ద చితి పేర్చుకున్నాడు. అనంతరం చితికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాలిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
Read Also : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు.. నాంపల్లి కోర్టులో లొంగిపోయిన ఏ1 గంగిరెడ్డి
హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వృద్ధుడు చితికి నిప్పు పెట్టుకున్న ప్రాంతాన్ని పరిశీలించారు. తనకు తానే చితి పేర్చుకుని నిప్పంటించి అందులో దూకి ఆత్మాహుతి చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, వెంకటయ్య ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ మణెమ్మ తెలిపారు. వంతుల వారీగా కుమారుల వద్దకు వెళ్లడం ఇష్టం లేకనే వెంకటయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. వృద్దుడి భార్య గతంలో చనిపోయగా.. తన పేరు ఉన్న పొలాన్ని నలుగురు కుమారులకు రాసిచ్చాడు. కొంతకాలం పాటు సొంత గ్రామంలో నివాసం ఉంటున్న పెద్ద కుమారుడి ఇంట్లో ఉన్నాడు. అయితే ఐదు నెలల క్రితం వంతుల వారీగా నెలకు ఒకరు చొప్పున తండ్రిని పోషించాలని పెద్దల సమక్షంలో నలుగురు కుమారులు నిర్ణయం తీసుకున్నారు.
Also Read : ట్రాఫిక్ పోలీసులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి ఏసీ హెల్మెట్లు
ఇద్దరు కుమారులు సొంత గ్రామంలోనే ఉంటుండగా.. ఒకరు ముస్నాబాద్‌లో, మరొకరు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేటలో నివాసం ఉంటున్నారు. అయితే సొంత గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్లడం వెంకటయ్యకు ఇష్టం లేదు. దీంతో వంతుల వారీగా కుమారుల ఇళ్లల్లో ఉండటం ఇష్టం లేక మనస్తాపంతో వెంకటయ్య తన చితికి తానే నిప్పు పెట్టుకుని చనిపోయాడు. సొంత గ్రామంలో నివాసం ఉంటున్న పెద్ద కుమారుడి ఇంట్లో వంతు పూర్తై బుధవారం కరీంనగర్ జిల్లాలో నివాసం ఉంటున్న మరో కుమారుడి ఇంటికి వెళ్లాల్సి ఉంది. కానీ అక్కడికి వెళ్లని వెంకటయ్య.. ఇలా చితికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన పోషణ కుమారులకు భారం కాకూడదనే కారణంతో వెంకటయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. వెంకటయ్య మృతి గ్రామంలో కలకలం రేపుతోంది.
ఇవి కూడా చదవండి :
- టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్…
- పరీక్ష సరిగ్గా రాయలేదనే బాధలో కానిస్టేబుల్ అభ్యర్థి సూసైడ్..
- ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
- రీల్స్ కోసం వెర్రి చేష్టలు… గట్టిగా వార్నింగ్ ఇచ్చిన ఎండీ సజ్జనార్
- విడాకులను వేడుక చేసుకున్న మహిళ.. విడిపోయిన ఆనందంలో ఫోటోషూట్
One Comment