
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద విధులు నిర్వర్తించే ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఎండ నుండి రక్షణ కోసం ఏసి హెల్మెట్లు అందించాలని నిర్ణయించింది. ఇటీవల ప్రయోగాత్మకంగా కొంతమంది ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు వీటిని అందిదంచారు. వీటి పనితీరు, కానిస్టేబుళ్లకు ఉపయోగపడుతున్న తీరును పరిశీలించిన తర్వాత మిగతా ట్రాఫిక్ కానిస్టేబుళ్లు అందరికీ ఇవ్వనున్నారు. ఈ ఏసీ హెల్మెట్‌కు ప్రత్యేకంగా ట్రాఫిక్‌లో విధులు నిర్వర్తించే కానిస్టేబుళ్ల కోసమే తెలంగాణ పోలీస్ శాఖ ఇటీవల తయారుచేయించింది.
Read Also : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్…
వారం రోజుల క్రితం రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ ఎల్టీనగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో కొంతమంది ట్రాఫిక్ సిబ్బందికి ఏసీ హెల్మెట్లను అందించారు. ప్రస్తుతం వీటి పనితీరును పరిశీలిస్తున్నారు. త్వరలో అందరికీ వీటిని ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఏసీ హెల్మెట్‌కు అరగంటపాటు ఛార్జింగ్ చేస్తే మూడు గంటల పాటు ఉంటుంది. బ్యాటరీ ఆధారంగా ఈ ఏసీ హెల్మెట్ పనిచేసేలా అభివృద్ధి చేశారు. ఈ హెల్మెట్‌కు మూడు వైఫుల నుంచి గాలి వచ్చేలా రూపొందించారు. ముఖానికి, హెల్మెట్ లోపల.. ఇలా మూడు వైపుల నుంచి చల్లని గాలి వీస్తుంది. ఈ హెల్మెట్లు ఎండ ప్రభావం నుంచి కొంతమేరకు ఉపశమనం అందిస్తాయని, చల్లని గాలిని అందిస్తాయని చెబుతున్నారు. దీని వల్ల చల్లని వాతావరణంలో పనిచేసుకోవచ్చని అంటున్నారు. వడదెబ్బ, ఎండ వేడి నుంచి ట్రాఫిక్ కానిస్టేబుల్స్‌కు ఈ ఏసీ హెల్మెట్ కాపాడుతుందని పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
Also Read : పరీక్ష సరిగ్గా రాయలేదనే బాధలో కానిస్టేబుల్ అభ్యర్థి సూసైడ్..
ట్రాఫిక్ కానిస్టేబుళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వీటిని అందించాలని పోలీస్ శాఖ ఇటీవల నిర్ణయించింది. త్వరలోనే అందరికీ అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే రోడ్లపై ఏసీ హెల్మెట్ ధరించిన ట్రాఫిక్ కానిస్టేబుళ్లు కనిపించనున్నారు. ట్రాఫిక్‌లో డ్యూటీ చేయడమంటే కానిస్టేబుళ్లకు చాలా కష్టంతో కూడుకున్న పని. అదీ కూడా ఎండలో చేయాలంటే మరింతగా ఇబ్బందిగా ఉంటుంది. భమ భగలాడే ఎండలకు ట్రాఫిక్ కూడళ్ల వద్ద ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు. దీని వల్ల అనారోగ్యానికి ఎక్కువగా గురవుతూ ఉంటారు. ఎండలతో పాటు మరోవైపు కాలుష్యం వల్ల ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. దీనిని అర్థం చేసుకున్న పోలీస్ శాఖ.. కానిస్టేబుళ్ల సంక్షేమం కోసం అనే అనేక చర్యలు తీసుకుంటుంది. గతంలో ట్రాఫిక్ కానిస్టేబుల్స్‌కు కూలింగ్ గ్లాస్‌లు అందించిన పోలీస్ శాఖ.. ఇప్పుడు వినూత్నంగా ఉండే ఈ ఏసీ హెల్మెట్లను త్వరలో అందరికీ ఇవ్వనుంది.
ఇవి కూడా చదవండి :
- టీసీఎస్‌కు బాంబు బెదిరింపు కాల్… బాంబ్ ఉందంటూ అజ్ఞాత వ్యక్తి కాల్
- ఆమనగల్లు స్వాతి హాస్పిటల్ లో విషాదం… ఆపరేషన్ వికటించి యువకుడు మృతి
- ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
- రీల్స్ కోసం వెర్రి చేష్టలు… గట్టిగా వార్నింగ్ ఇచ్చిన ఎండీ సజ్జనార్
- టీ కాంగ్రెస్‌లో జోష్.. ప్రియాంకగాంధీ తెలంగాణ పర్యటనకు ముహూర్తం ఖరారు
One Comment