
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రేణుక భర్త డాక్యా నాయక్ నుంచి ఏఈ పేపర్ కొనుగోలు చేసిన వ్యవహారంలో సిట్ పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. కోస్గీ భగవంత్ కుమార్, కోస్గీ రవికుమార్ అనే ఇద్దరు వ్యక్తులను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. తన తమ్ముడు కోస్గీ రవికుమార్ కోసం భగవంత కుమార్ పేపేర్ కొనుగోలు చేసినట్లు సిట్ పోలీసులు గుర్తించారు. ఢాక్యా నాయక్ బ్యాంకు అకౌంట్లను దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద లావాదేవీల గురించి ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో కోస్గీ భగవంత్ కుమార్ విషయం బయటపడింది.
Read Also : పరీక్ష సరిగ్గా రాయలేదనే బాధలో కానిస్టేబుల్ అభ్యర్థి సూసైడ్..
వికారాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో కోస్గీ భగవంత్ కుమార్ పని చేస్తున్నట్లు గుర్తించారు. రెండు లక్షలకు ఢాక్యా నాయక్ వద్ద ఏఈ పేపర్ కొనుగోలు చేసినట్లు తేలింది. దీంతో వారిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో విచారణ దాదాపు పూర్తయింది. అనుమానం ఉన్న మరికొంతమందిని కూడా విచారిస్తోంది. ఇప్పటివరకు నిందితులకు రూ.33.4 లక్షలు అందినట్లు సిట్ తేల్చింది. కొంతమంది నేరుగా నగదు తీసుకోగా.. మరికొంతమంది బ్యాంకు ఖాతాలో జమ చేయించుకున్నట్లు అధికారులు గుర్తించారు. పేపర్ లీక్ చేయడం వల్ల ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్‌కు రూ.16 లక్షలు అందింది.
Also Read : టీసీఎస్‌కు బాంబు బెదిరింపు కాల్… బాంబ్ ఉందంటూ అజ్ఞాత వ్యక్తి కాల్
ప్రవీణ్ కుమార్ ద్వారా రూ.10 లక్షలకు ఏఈ పేపర్‌ను రేణుక రాథోడ్ తీసుకున్నారు. ఆ తర్వాత రేణుక భర్త డాక్యా, రాజేశ్వర్లు కలిసి మరో ఐదుగురికి విక్రయించారు. విక్రయం ద్వారా రాజేశ్వర్, డాఖ్యాలకు రూ.27.4 లక్షలు వచ్చినట్టు సిట్ అధికారులు తేల్చారు. వీటిల్లో రూ.10 లక్షలను ప్రవీణ్‌కుమార్‌కు ఇవ్వగా.. రాజేశ్వర్, డాక్యాలకు రూ.17.4 లక్షలు మిగిలాయి. ఇక డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పేపర్‌ను ఖమ్మంకు చెందిన దంపతులకు ప్రవీణ్ కుమార్ రూ.6 లక్షలకు అమ్ముకున్నాడు. ఈ డబ్బులను ప్రవీణ్ బ్యాంకులో దాచిపెట్టుకోగా.. ఆ సొమ్మును సిట్ అధికారులు స్తంభింపజేశారు. ఆ తర్వాత గ్రూప్-1 ప్రశ్నాపత్రాన్ని ప్రవీణ్, రాజశేఖర్ ఉచితంగానే ఇచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అటు ప్రశ్నాపత్రాలు అమ్మగా వచ్చిన డబ్బుతో రాజేశ్వర్ ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు.
ఇవి కూడా చదవండి :
- పొంగులేటి, జూపల్లిని బీజేపీలోకి ఆహ్వానించిన ఈటల… వారి నిర్ణయం ఇదే..!
- ఆమనగల్లు స్వాతి హాస్పిటల్ లో విషాదం… ఆపరేషన్ వికటించి యువకుడు మృతి
- ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
- పొంగులేటి ఇంటికి ఈటల.. తనకు సమాచారం లేదన్న బండి.. బీజేపీలో ఏం జరుగుతోంది?
- రీల్స్ కోసం వెర్రి చేష్టలు… గట్టిగా వార్నింగ్ ఇచ్చిన ఎండీ సజ్జనార్
2 Comments