
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : రీల్స్ కోసం కొంత మంది యువకులు వెర్రి చేష్టలు చేస్తున్నారు. బైక్‌ల మీద ప్రమాదకర స్టంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొంత మంది తమ ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. హైదరాబాద్‌లో ఓ యువకుడు టీఎస్ ఆర్టీసీ బస్సుతోనే వెకిలి చేష్టలు చేశాడు. ఇది సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌కు ఆగ్రహం తెప్పించింది. ‘పిచ్చి వేషాలు వేయకండి’ అంటూ ఆయన సోషల్ మీడియా ద్వారా వార్నింగ్ ఇచ్చారు. మీ తల్లిదండ్రులకు దు:ఖాన్ని మిగల్చకండి అంటూ హితవు కూడా పలికారు. మిధానీ డిపోకు చెందిన బస్సు 104-ఎ మార్గంలో వెళుతుండగా ఓ యువకుడు స్కూటీపై దాని వెనుక వెళ్తూ.. కాలుతో బస్సు వెనుక భాగాన్ని నెడుతున్నట్లున్న ఫోజిచ్చాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ ఘటనపై సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వెర్రి వేయి విధాలు అంటే ఇదే! సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం రోడ్లపై ఇలాంటి పిచ్చి వేషాలు వేయకండి. ప్రమాదాల బారినపడి మీ తల్లిదండ్రులకు శోకాన్ని మిగల్చకండి’ అని సజ్జనార్ ట్వీట్ చేశారు. ఇలాంటి ఘటనలను TSRTC యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి :
- ఒక అమ్మకు బిడ్డగా మరణించినా.. మరో అమ్మ పిలుపులో బతికే ఉంటా..!
- ముడుపుల మత్తులో మైనింగ్, రెవెన్యూ అధికారులు.. యదేచ్చగా ఎర్రమట్టి అక్రమ రవాణా
- ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్..
- ‘రైతులు అల్లాడుతుంటే కేసీఆర్ ఢిల్లీ పోవడమేంటి?’… బండి సంజయ్ ఫైర్
- నోరూరించే నీరా.. నగరవాసుల కోసం రెడీ.. కేఫ్ ప్రారంభించిన మంత్రులు
4 Comments