
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభానికి సిద్ధమైంది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా నిర్మించిన నూతన సెక్రటేరియట్ (డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెక్రటేరియట్) ఈనెల 30న సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ సందర్భంగా గద్వాల వాసికి అరుదైన అవకాశం దక్కింది. నూతన సెక్రటేరియట్ ముఖ్య భద్రతాధికారి (CSO)గా గద్వాలలోని వడ్లవీధికి చెందిన అదనపు కమాండెంట్ పి.వెంకట్రాములు నియమితులయ్యారు. ఆయన నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రత్యేక పోలీస్ (TSPSC) అదనపు డీజీపీ స్వాతి లక్రా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు.
Read Also : వందేళ్లు వర్థిల్లే ఉప్పల్ స్కైవాక్… త్వరలో ప్రారంభానికి సిద్ధం
1991 బ్యాచ్‌కు చెందిన వెంకట్రాములు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పోలీస్ (APSP)లో ఆర్‌ఎస్సైగా ఉద్యోగంలో చేరారు. తొలుత యూసుఫ్‌గూడలోని మొదటి బెటాలియన్‌లో ఎస్‌ఐ పనిచేశారు. ఆ తర్వాత ఆర్‌ఐగా ప్రమోషన్ పొంది కాకినాడ, కర్నూల్ బెటాలియన్లలో విధులు నిర్వర్తించారు. డిచ్‌పల్లి, వరంగల్ మామునూర్ బెటాలియన్లలో అసిస్టెంట్ కమాండెంట్‌గా పనిచేశారు. అదనపు కమాండెంట్‌గా (ASP) పదోన్నతి పొందిన ఆయన.. మెున్నటి వరకు ఇబ్రహీంపట్నంలోని టీఎస్‌ఎస్‌పీ మూడో బెటాలియన్‌లో విధులు నిర్వర్తించారు. పోలీసుశాఖలో భద్రతపరమైన విధులు నిర్వర్తించడంలో ప్రత్యేకత చాటుకున్నా వెంకట్రాములు.. తెలంగాణ నూతన సచివాలయానికి తొలి CSOగా కీలక బాధ్యతలు చేపట్టారు. వెంకట్రాముు సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి దౌలన్న ఇస్త్రీ షాపు నిర్వహించేవారు.
Also Read : మహారాష్ట్రపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్… త్వరలో 12 లక్షల మందితో భారీ కిసాన్ ర్యాలీ!
తండ్రి కష్టాన్ని గుర్తించి ఆయన చదువుపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు పట్టణంలోని శ్రీరవీంద్ర ఉన్నత పాఠశాలలో చదివారు. ఇంటర్, డిగ్రీ గద్వాలోని ఎంఏఎల్‌డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్తి చేశారు. ఎన్సీసీ శిక్షణ సమయంలో ప్రతిభ కనబరచిన ఈయన శిక్షణ సమయంలో అండర్ ఆఫీసర్‌గా వ్యవహరించారు. పలు క్రీడల్లో ఛాంపియన్‌గానూ నిలిచారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వెంకట్రాములు పోలీసు శాఖలో కీలక పదవి చేపట్టడం పట్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు, గద్వాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వెంకట్రాములుకు భార్య పద్మ, కూతుళ్లు అనిత, ప్రియాంక ఉండగా.. వాళ్లిద్దరూ వైద్యవృత్తిలో కొనసాగుతున్నారు.
ఇవి కూడా చదవండి :
- ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో మావోల దుశ్చర్య… 10 మంది జవాన్ల మృతి
- ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ఫైర్… రైతులు ఆదుకోవటంలో విఫలమైందని మండిపాటు
- కేటీఆర్, బండి సంజయ్, రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అందరి ఫోకస్ రైతులపైనే!!
- ఎన్నికల వేళ తెలంగాణలో టీడీపీ బిగ్ ప్లాన్.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ సభలు
- 40 మంది మహిళలకు భర్త పేరు ఒకటే.. విస్తుపోయిన అధికారులు!
One Comment