
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో అకాల వర్షాలు రైతుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు నేలపాలు కావటంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతనటంతోపాటు కల్లాల్లోని ధాన్యం రాశులు తడిసి ముద్దయ్యాయి. అన్నదాతలను ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఫైరవుతున్నాయి. రైతులు కన్నీళ్లు పెడుతున్నా.. ప్రభుత్వానికి చీమకట్టినట్లుగా కూడా లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయి రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుంటే.. తండ్రీ,కుమారులు ఊరేగుతున్నారని ట్వీట్టర్ వేదికగా విమర్శంచారు.
Read Also : కేటీఆర్, బండి సంజయ్, రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అందరి ఫోకస్ రైతులపైనే!!
“అకాల వర్షాలతో కల్లాల్లో ధాన్యం తడిసి రైతులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే… అయ్యా ఔరంగాబాద్‌లో..కొడుకు ప్లీనరీల పేరుతో..రాజకీయ సభలు పెట్టుకుని ఊరేగుతున్నారు. వీళ్లకు మానవత్వం ఉందా.. బాధ్యత ఉందా.. ఇది ప్రభుత్వమేనా ? రైతు – యువత ఏకమై బీఆర్ఎస్‌ను బొందపెట్టే సమయం వస్తుంది.” అంటూ రేవంత్ ట్వీట్ చేశారు. ఇక రాష్ట్రంలో మంగళవారం కురిసిన భారీ వర్షాలకు పలు జిల్లాల్లో వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షం అన్నదాతను అతలాకుతలం చేసింది. దీంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే రైతులు అధైర్యపడొద్దని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆదుకుంటామని మంత్రులు హరీశ్, కేటీఆర్ వెల్లడించారు. సిద్దిపేట జిల్లాలో పంటనష్టపోయిన ప్రాంతాలను పరిశీలించిన హరీశ్.. ఎకరాకు రూ. 10 వేల చొప్పున పంటనష్టం అందిస్తామని చెప్పారు.
ఇవి కూడా చదవండి :
- అన్నదాతలు అధైర్య పడొద్దు… పంట నష్టపోయిన రైతులకు మంత్రి హరీశ్ భరోసా
- 40 మంది మహిళలకు భర్త పేరు ఒకటే.. విస్తుపోయిన అధికారులు!
- మహేష్ హత్య కేసులో ట్విస్ట్.. కలకలం రేపుతోన్న యువతి వీడియో
- సుదర్శనయాగం, పూర్ణాహుతి, గ్యాదరింగ్.. కొత్త సచివాలయం ప్రారంభోత్సవ వేడుకలు
- దొంగతనం కేసులో పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి మృతి.. కుటుంబసభ్యుల ఆందోళన
One Comment