
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : దేశంలోనే తొలిసారిగా బిహార్‌లో కులగణన జరుగుతోంది. దీనిని రెండు దశల్లో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తొలి విడత పూర్తికాగా.. రెండో విడత ఏప్రిల్ 15న ప్రారంభమయ్యింది. ఇందులో భాగంగా ప్రభుత్వ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి కులం, విద్య, ఆర్థిక స్థితి, కుటుంబ స్థితిగతులు వంటి విషయాలను నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ చోట దాదాపు 40 మంది మహిళలు.. ఒకే పేరును తమ భర్తగా ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేసుకోవడంతో అధికారులు అవాక్కయ్యారు.
Read Also : మహేష్ హత్య కేసులో ట్విస్ట్.. కలకలం రేపుతోన్న యువతి వీడియో
అధికారులకు విచిత్రమైన ఈ పరిస్థితి అర్వల్ జిల్లాలో ఎదురయ్యింది. అర్వాల్ పట్టణం ఏడో వార్డులోని రెడ్‌లైట్ ఏరియాలో నివాసం ఉంటున్న వారి వివరాలను నమోదుకు ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లారు. అక్కడ సుమారు 40 మంది మహిళలు.. తమ భర్త పేరు రూప్‌చంద్ అని చెప్పారు. చాలా మంది పిల్లలు సైతం తమ తండ్రి పేరు రూప్‌చంద్ అని చెప్పడంతో అధికారులు విస్తుపోయారు. అయితే, అందరూ అతడి పేరే ఎందుకు చెబుతున్నారని ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. కుల గణన నమోదుకు వచ్చిన రాజీవ్ రంజన్ రాకేష్ అనే టీచర్ మాట్లాడుతూ.. ఇక్కడ మహిళలు తమ భర్త, తండ్రి, కొడుకుకు రూపచంద్ అని పేరు పెట్టారు.
Also Read : సుదర్శనయాగం, పూర్ణాహుతి, గ్యాదరింగ్.. కొత్త సచివాలయం ప్రారంభోత్సవ వేడుకలు
అయితే, రూప్‌చంద్ ఎవరనే సమాచారం సేకరించగా అతడు మనిషి కాదని, డబ్బునే ‘రూప్‌చంద్’ అని పిలుస్తారని తెలిపారు. మహిళలు రూప్‌చంద్‌ను తమ భర్తగా చేసుకోవడానికి ఇదే కారణమని అన్నారు. అయితే, ఆ ప్రాంతంలో రూప్‌చంద్ అనే డ్యాన్సర్ ఉన్నాడు. చాలా ఏళ్లుగా పాటలు పాడుతూ.. డాన్స్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి అక్కడ సొంత నివాసం కూడా లేదు. అయినప్పటికీ.. అతడిపై అభిమానంతోనే ఆ మహిళలంతా రూప్‌చంద్‌ను తమ భర్త పేరుగా చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ఉండేవారికి కులం అంటూ ఏదీ లేదని అధికారులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి :
- దొంగతనం కేసులో పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి మృతి.. కుటుంబసభ్యుల ఆందోళన
- ఎన్నికల వేళ తెలంగాణలో టీడీపీ బిగ్ ప్లాన్.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ సభలు
- హైదరాబాద్ మెట్రోకు పెరిగిన రద్దీ… ఇక వెయిటింగ్ చేయాల్సిన అవసరం లేదు
- దమ్ముంటే నాపై పోటీ చేయ్.. రేణుకా చౌదరికి మంత్రి పువ్వాడ సవాల్
- జిల్లెల్ల లో విషాదం.. అన్న మృతి చెందడంతో మనస్తాపానికి గురై తమ్ముడు ఆత్మహత్య
2 Comments