
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఢిల్లీలోని సాకేత్ కోర్టు పరిసరాల్లో కాల్పులు కలకలం రేపాయి. లాయర్ దుస్తుల్లో వచ్చిన దుండగులు.. కోర్టు ఆవరణలోనే కాల్పులకు తెగబడ్డారు. దాదాపు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి ఘటనా స్థలం నుంచి పరార్ అయ్యారు. ఈ కాల్పుల్లో ఓ మహిళతో పాటు లాయర్‌కు గాయాలవ్వగా.. ఇద్దరిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కోర్టు ప్రాంగణంలోని అడ్వకేట్స్ బ్లాక్ దగ్గర ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులు జరిపారు. ఆ కాల్పులతో కోర్టు ప్రాంగణంలోని అడ్వకేట్లు, ప్రజలు ఉలిక్కిపాటుకు గురయ్యారు. ఏం జరిగిందో తెలియక ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కాల్పులతో కోర్టు పరిసరాల్లో ఒక్కసారిగా అలజడి రేగింది.
Read Also : కొడుకు ఉద్యోగం కోసమని తండ్రి… టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్
అక్కడ ఉన్నవారందరూ భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఓ మహిళ కడుపులో నుంచి రక్తం కారుతుండగా.. ఆమె నొప్పితో కొట్టుమిట్టాడుతోంది. ఆమెను కొంతమంది ఆస్పత్రికి తరలిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపడుతున్నారు. సీసీ టీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన వారిని ఎయిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. అత్యంత భద్రత ఉండే కోర్టు ప్రాంగణంలో కాల్పులు జరగడం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఇవి కూడా చదవండి :
- బీఆర్‌ఎస్ కథ అడ్డం తిరిగింది… కేసిఆర్ వేసిన ప్లాన్స్ అన్నీ ఫైల్..!!!
- ‘బలగం’ కలిపిన మరో బంధం… తొమ్మిదేళ్ల తర్వాత మాట్లాడుకున్న అక్కాతమ్ముడు
- పాకిస్థాన్‌లో అత్యంత దుర్భర పరిస్థితులు… రంజాన్ వేళ కన్నీరు పెడుతున్న ప్రజలు
- సనత్‌నగర్‌లో దారుణ ఘటన… అమావాస్య రోజున 8 ఏళ్ల బాలుడిని బలి ఇచ్చిన హిజ్రా
- ఎండల ఎఫెక్ట్… ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్న మెట్రో స్టేషన్లు
2 Comments