
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కాక రేపుతోన్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు జరగనున్న కర్ణాటక ఎన్నికలపై పార్టీలన్నీ దృష్టి పెట్టాయి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు ప్రాంతీయ పార్టీ అయిన మాజీ సీఎం కుమారస్వామి అధ్వర్యంలోని జేడీఎస్ కూడా గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికల పోలింగ్‌కు కొద్దిరోజులు మాత్రమే గడువు ఉండటంతో.. గెలుపే లక్ష్యంగా పార్టీలన్నీ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఎన్నికల వేళ ఎవరు గెలుస్తారనే దానిపై పలు సర్వే సంస్థలు ప్రజల నాడిని పసిగట్టే పనిలో ఉన్నాయి. కర్ణాటకలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉండగా.. మళ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని నిలబెట్టుకోవడం ఆ పార్టీకి సవాల్‌గా మారింది.
Read Also : అంబేడ్కర్ మహావిగ్రహావిష్కరణకు అంతా సిద్ధం.. ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్
కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి గట్టి పోటీ ఏర్పడింది. ఇక జేడీఎస్ కూడా కింగ్ మేకర్ అవ్వాలని శతవిథాలుగా ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే అమిత్ షా పలుమార్లు ప్రచారం నిర్వహించగా.. ఇక్కడ గెలిచేందుకు బీజేపీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా తెలంగాణ బీజేపీ నేతలు కూడా కర్ణాటకలో రంగంలోకి దిగారు. కర్ణాటకలో బీజేపీ గెలుపు కోసం టీ బీజేపీ నేతలు కృషి చేస్తోన్నారు. ఈ మేరకు పలువురు తెలంగాణ కాషాయ నేతలను కర్ణాటక ఎన్నికల కోసం పార్టీ హైకమాండ్ ఉపయోగించుకుంటోంది. తెలంగాణకు చెందిన నేతలకు నియోజకవర్గ సమన్వయకర్తలుగా బాధ్యతలు అప్పగించింది. దాదాపు రాష్ట్రానికి చెందిన 20 మంది నేతలకు కర్ణాటక ఎన్నికల్లో నియోజకవర్గాల సమన్వయ బాధ్యతలను అప్పగించారు.
Also Read : మ్యాచింగ్ సెంటర్‌లో దంపతుల గొడవ.. భార్యను కత్తెరతో పొడిచిన భర్త..
రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావుతో పాటు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకు బాధ్యతలు ఇచ్చింది. ఇక మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి, మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, ఎస్సీ మెర్చా జాతీయ అధ్యక్షుడు ఎస్.కుమార్‌లకు నియోజకవర్గాల్లో నేతలను, కార్యకర్తలను సమన్వయం చేసుకునే బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే టీ బీజేపీ నేతలు 20 మంది తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో రంగంలోకి దిగారు. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. ఒక్కొ నియోజకవర్గానికి ఒక్కొ సమన్వయకర్తను కాషాయదళం నియమించింది. పార్టీ నుంచి పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థులకు వీళ్లు సహకారం అందించనున్నారు. 13 రాష్ట్రాలకు చెందిన నేతలను కర్ణాటక ఎన్నికల్లో ఇంచార్జ్‌గా బీజేపీ అధిష్టానం నియమించినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి :
- కాయ్ రాజా.. కాయ్ ! పల్లెలకు పాకిన ఐపీఎల్ బెట్టింగ్
- బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుంది…. ఎంపీపీ పుట్టల సునీత
- అట్లుంటది మాతో పెట్టుకుంటే.. కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగొచ్చింది..మంత్రి కేటిఆర్
- ఓరుగల్లులో నిరుద్యోగ మార్చ్.. బీఆర్ఎస్ పై బీజేపీ మరో అస్త్రం!!
- రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కారుపై 18 పెండింగ్ చలాన్లు.. రూల్స్ మీకు వర్తించవా సార్?