
క్రైమ్ మిర్రర్, కరీంనగర్ ప్రతినిధి : భార్యాభర్తలన్నప్పుడు ఇద్దరి మధ్య గొడవలు రావటం సర్వసాధారణమైన విషయం. అయితే.. అవి ఆ ఏ విషయంలో వస్తున్నాయనేదే ఇక్కడ మ్యాటర్. సాధారణంగా అయితే.. అత్తింటివాళ్ల విషయంలో భార్య.. చెప్పినమాట వినట్లేదంటూ భర్త.. ఇలా గొడవలు పెట్టుకోవటం సహజంగా చూస్తుంటాం. ఇవే కాకుండా.. చిన్న చిన్న వాటికి కూడా చిలిపిగా అలిగిన సందర్భాలు కూడా గొడవకు దారి తీస్తుంటాయి కూడా. భర్తకు నచ్చింది భార్యకు నచ్చకపోవటం.. భార్యకు నచ్చింది భర్తకు నచ్చకపోవటం.. విషయంలోనూ ఇద్దరి మధ్య కొట్లాట మొదలవుతుంది. అయితే.. ఆ కొట్లాట.. ఏకంగా కత్తెరతో పొడుచుకునే వరకు వెళ్తేనే అసలు బాధ. అచ్చం అలాంటి ఘటనే జరిగింది కరీంనగర్‌లో.
Read Also : కాయ్ రాజా.. కాయ్ ! పల్లెలకు పాకిన ఐపీఎల్ బెట్టింగ్
కరీంనగర్ టవర్ సర్కిల్‌లో ఉన్న ఓ మ్యాచింగ్ సెంటర్‌కు సంతోష్, హారతి దంపతులు వచ్చారు. ఏదో మ్యాచింగ్ కొనేందుకు వచ్చిన వారి మధ్య అభిప్రాయ భేదం వచ్చింది. ఈ క్రమంలోనే భార్య భర్తల మధ్య గొడవ తలెత్తింది. ఓ మ్యాచింగ్ విషయంలో ఇద్దరూ మాటామాటా అనుకున్నారు. సెలెక్షన్ విషయంలో తలెత్తిన గొడవ.. తీవ్ర స్థాయికి చేరింది. దీంతో.. భార్యపై సంతోష్ కోపంతో ఊగిపోయాడు. కోపావేశంతో.. అక్కడే ఉన్న కత్తెరను తీసుకుని భార్య హారతిని పొడిచేశాడు. ఈ ఊహించన ఘటనకు షాపులో ఉన్న వాళ్లంతా షాక్‌కు గురయ్యారు. వెంటనే షాక్ నుంచి తేరుకుని.. రక్తస్రావంతో కింద పడిపోయిన హారతిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు కేసు నమోదు చేసి.. విచారిస్తున్నారు.
Also Read : బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుంది…. ఎంపీపీ పుట్టల సునీత
ఇద్దరి మధ్య ఎలాంటి విషయంలో గొడవ తలెత్తింది.. అన్న కోణంలో విచారిస్తున్నారు. భర్త సంతోష్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే.. భార్యాభర్తల నడుమ ఏదైన సెలెక్షన్ విషయంలో ఇద్దరి ఇష్టం ఒకటే ఉండాల్సిన అవసరం లేదు. అయితే.. ఇలాంటి సమయంలో ఎవరో ఒకరు కంప్రమైజ్ అయినా.. ఎదుటివారి ఇష్టానికి గౌరవం ఇచ్చినా.. అక్కడితో అంతా సర్ధుకుంటుంది. కానీ.. అలా కాదు.. నేను చెప్పిందే నెగ్గాలని ఇద్దరూ బీష్మించుకుని కూర్చుంటే.. అది చాలా దూరం వెళ్తుంది. అయితే.. మాటామాట పెరిగి పంచాయితీ దాకా వెళితే.. నాలుగు మంచి మాటలు చెప్పో.. తప్పు ఉన్న వారిని మందలించో సర్ధి చెప్పొచ్చు కానీ.. ఏకంగా చంపేసుకునేంత దూరం వెళ్లటమనేదే ఇక్కడ విచారించాల్సిన విషయం.
ఇవి కూడా చదవండి :
- అట్లుంటది మాతో పెట్టుకుంటే.. కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగొచ్చింది..మంత్రి కేటిఆర్
- ఓరుగల్లులో నిరుద్యోగ మార్చ్.. బీఆర్ఎస్ పై బీజేపీ మరో అస్త్రం!!
- ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై… బీజేపీ గూటికి చేరేందుకు రెడీ
- రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కారుపై 18 పెండింగ్ చలాన్లు.. రూల్స్ మీకు వర్తించవా సార్?
- స్టీల్ ప్లంట్ పై కేంద్రం కీలక ప్రకటన… జగన్ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్..!!
One Comment