
క్రైమ్ మిర్రర్, రంగారెడ్డి ప్రతినిధి : రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను అతి కిరాతకంగా హత్య చేసిన కొంతమంది దుండగులు.. మృతదేహాన్ని గోనెసంచిలో ప్యాక్ చేసి పడేశారు. దుర్వాసన రావడంతో దీనిని గమనించిన స్ధానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. మహిళ ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మహేశ్వరం మండలం సర్దార్ నగర్ గేటు సమీపంలో ఈ దారుణం వెలుగుచూసింది. గుర్తుతెలియని కొందరు దుండగులు ఒక మహిళను దారుణంగా హత్య చేశారు.
Also Read : మహబూబ్‌నగర్ జిల్లాలో విషాదం…. కల్తీ కల్లు తాగి ఇద్దరు మృతి
అనంతరం గోనెసంచిలో ప్యాకింగ్ చేసి అక్కడే పడేశారు. అయితే వాసన రావడాన్ని స్థానికులు గుర్తించి వెంటనే డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన ఘటన స్థలానికి పహాడీ షరీఫ్ పోలీసులు చేరుకున్నారు. మహిళ వయస్సు 35 నుండి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని గుర్తించారు. మూడు రోజుల క్రితమే మహిళను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహిళను రేప్ చేసి హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. మహిళను చంపిన తర్వాత కట్టివేసి సంచిలో వేసి వెళ్లినట్లుగా చెబుతున్నారు. మహిళ వివరాలతో పాటు కుటుంబసభ్యుల వివరాలను కొనుగోనేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
Read Also : రాహుల్ గాంధీపై ‘అనర్హత వేటు’… లోక్‌సత్తా జయప్రకాష్ నారాయణ లోతైన విశ్లేషణ
మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల ఏదైనా మహిళ మిస్సింగ్ కేసు నమోదైందా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. మహిళను ఎవరు హత్య చేశారు? హత్యకు గల కారణాలేంటి? అనేది పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మహిళ కుటుంబసభ్యుల వివరాలు తెలిసిన తర్వాత వారికి మృతదేహాన్ని అప్పగించనున్నారు. ఈ హత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నామని, నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఏసీపీ అంజయ్య స్పష్టం చేశారు. ఈ హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి :
- స్కూల్ కమిటీ ఛైర్మన్ నిర్వాహకం… తరగతి గదిలోనే మిర్చి పంట ఆరబోత
- పెద్ద పేపర్ల పేరుతో వసూళ్ల దందాలు…. మండలంలో జరుగుతున్న భూ వ్యవహారంలో వారిదే కీలక పాత్ర..
- స్విమ్మింగ్‌లో సత్తా చాటిన హీరో మాధవన్ కొడుకు… ఏడు పతకాలు సాధించిన వేదాంత్