
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ దూకుడు పెంచింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు మరోసారి సిట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పేపర్ లీకేజీపై ఆధారాలు ఇవ్వాలని మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇటీవల నోటీసులు ఇవ్వగా.. బండి సంజయ్ సిట్ ముందు హాజరుకాలేదు. పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా తాను ఢిల్లీలో ఉన్నానని, పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనాల్సి ఉన్నందున హాజరుకాలేనంటూ సిట్‌కు బండి సంజయ్ లేఖ రాశారు. శుక్రవారం సిట్ ముందు బండి హాజరుకావాల్సి ఉండగా దూరంగా ఉన్నారు. దీంతో మరోసారి బండికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులకు బండి ఎలా స్పందిస్తారు? సిట్ ముందు హాజరవుతారా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది.
Read Also : బండి సంజయ్‌పై మంత్రి హరీశ్ రావు ఫైర్… ట్విట్టర్ వేదికగా బండి సంజయ్‌కు ప్రశ్నలు
సిట్‌పై తనకు నమ్మకం లేదని, ఆధారాలు ఇవ్వదల్చుకోలేదంటూ శుక్రవారం సిట్‌కు రాసిన లేఖలో బండి పేర్కొన్నారు. తనకు సిట్ నోటీసులు అందలేదని, సిట్‌ను తాను విశ్వసించడం లేదని తెలిపారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కోరుతున్నట్లు చెప్పారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై నేడు తెలంగాణ బీజేపీ నిరుద్యోగ మహాధర్నా కార్యక్రమం చేపట్టనుంది. ఇందిరాపార్క్ వద్ద జరగనున్న ఈ నిరసన కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఈ ధర్నాకు హైకోర్టు కూడా అనుమతి జారీ చేసింది. ‘మా కొలువులు మాగ్గావాలే’ అనే నినాదంతో ఈ ధర్నా చేపట్టనున్నారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ముఖ్య నేతలు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొననున్నారు.
Also Read : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు.. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందన్న రేవంత్
ఈ కార్యక్రమం జరగనున్న క్రమంలో బండి సంజయ్‌కు సిట్ మరోసారి నోటీసులు జారీ చేయడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. పేపర్ లీక్‌పై బండి సంజయ్ చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని సిట్ నోటీసులు ఇచ్చింది. కానీ సిట్‌కు ఆధారాలు ఇచ్చేందుకు బండి సంజయ్ విముఖత వ్యక్తం చేస్తోన్నారు. దీంతో రెండోసారి బండి సంజయ్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంతో.. ఆయన విచారణకు హాజరవుతారా? లేదా? అనేది సస్పెన్స్‌గా మారింది. ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. దీంతో రేవంత్ సిట్ ముందు హాజరై తన దగ్గర ఉన్న ఆధారాలు సమర్పించారు. సిట్ మాత్రం రేవంత్ ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని చెబుతోంది. దీంతో సిట్ కార్యాయలం వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సిట్ ఆఫీస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్‌లు చేయడంతో టెన్షన్ చోటుచేసుకుంది.
ఇవి కూడా చదవండి :
- మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఉద్యమం మరింత ఉధృతం… కార్యాచరణ ప్రకటించిన ఎమ్మెల్సీ కవిత
- హైదరాబాద్‌లో మరోసారి ఈడీ దాడుల కలకలం… కన్సల్టెన్సీ సంస్థల్లో సోదాలు
- హైదరాబాద్‌లో బాలిక కిడ్నాప్ కలకలం… సొంత బంధువులే కిడ్నాప్ చేసి ఉంటారని తండ్రి ఫిర్యాదు
- ఈ నెల 29న హైదరాబాద్‌లో టీడీపీ బహిరంగ సభ.. పాల్గొననున్న చంద్రబాబు
- చంద్రబాబుకు వెన్నపోటు బాగా అలవాటు… ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై మంత్రి రోజా
2 Comments