
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ సర్కారుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీని నిరసిస్తూ.. మా నౌకరీలు మాగ్గావాలే నినాదంతో.. బీజేపీ నిర్వహిస్తోన్న నిరుద్యోగుల మహాధర్నాలో పాల్గొన్న బండి సంజయ్.. తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ కొడుకు కేటీఆర్‌ను మెడలు పట్టి బయటకు తోయాలంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై సిట్‌తో కాదు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్న డిమాండ్‌తోనే మహా ధర్నా చేపట్టినట్టు తెలిపారు. తాను లేనప్పుడు తన ఇంటికి వచ్చి నోటీసులు అంటించిపోయారు. ఈ రోజు స్వయంగానే నేనే అధికారులను పిలిచి నోటీసులు తీసుకున్నానని తెలిపారు. ఈ విషయంపై తన లీగల్ టీమ్ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
Read Also : ఉపాధి హామీ పనుల్లో బయటపడ్డ వెండి నాణేలు, పంచుకున్న కూలీలు.. కట్ చేస్తే
అయితే.. సిట్ విచారణతో అసలు దొంగలను కాపాడే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. ముందేమో ఈ పేపర్ లీకేజీకి ఇద్దరు మాత్రమే కారణమని కేటీఆర్ చెప్పారు. మరి ఇద్దరే ఉంటే ఇప్పుడు 20 మందికి ఎందుకు నోటీసులు ఇచ్చారంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. పేపర్ల లీకేజీకి బాధ్యత వహిస్తూ.. కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏదైనా అంటే చాలు కోర్టుకు వెళ్తారంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి భయమంటే ఏంటో చూపిస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమకు కేసులు, జైళ్లు కొత్త కాదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. “నిరుద్యోగులెవ్వరూ ఆందోళన చెందొద్దు. సర్కారు మెడలు వంచే దాకా వదిలే ప్రసక్తే లేదు. నిరాశకు అస్సలు గురికావొద్దు. రానున్న ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుంది.” అంటూ బండి సంజయ్ హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి :
- నాకు జైలు శిక్షా? ఐ డోంట్ కేర్… అనర్హత వేటుపై స్పందించిన రాహుల్ గాంధీ
- ధర్నాచౌక్ వద్ద బీజేపీ మహాధర్నాలో పాల్గొన్న బండి సంజయ్… సిట్ నోటీసులపై ఆగ్రహం
- ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు?.. ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించిన హైకోర్టు, నోటీసులు జారీ
- బాసర ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం… యాదాద్రి తరహాలో ఆలయ అభివృద్ధి
- అడిషనల్ ఎస్పి ఏడీగా బాధ్యతలు చేపట్టిన వి.శ్రీనివాసరావు….
One Comment