
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో (ISRO) మరో రికార్డును సృష్టించడానికి సన్నద్ధమైంది. కమర్షియల్ బాట పట్టిన తరువాత అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలు, కార్పొరేట్ కంపెనీలకు చెందిన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగిస్తోంది. ఈ క్రమంలో మరో ముందడుగు వేయనుంది. ఒకేసారి 36 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించడానికి ఏర్పాట్లను పూర్తి చేసింది. అవన్నీ వన్ వెబ్ ఇంటర్నెట్ సంస్థకు చెందిన ఉపగ్రహాలు. బ్రాడ్ బ్యాండ్ సేవలను మరింత మెరుగుపర్చడానికి జెన్- 1 కాన్స్టెలేషన్ నెట్ వర్క్ శాటిలైట్లను ప్రయోగించడానికి ఇస్రో సహకారాన్ని తీసుకోనుంది వన్ వెబ్ ఇంటర్నెట్.
Read Also : రాహుల్ గాంధీపై ‘అనర్హత వేటు’… లోక్‌సత్తా జయప్రకాష్ నారాయణ లోతైన విశ్లేషణ
ఇది- బ్రిటన్ కు చెందిన కంపెనీ. బ్రిటన్ కు చెందిన నెట్ వర్క్ యాక్సెస్ అసోసియేట్స్ లిమిటెడ్ గ్రూప్ లో వన్ వెబ్ ఒకటి. మొత్తంగా 72 శాటిలైట్లను లో-ఎర్త్ ఆర్బిట్ లో ప్రవేశపెట్టడానికి ఇస్రోతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇదివరకు కూడా ఇదే కంపెనీకి చెందిన శాటిలైట్లను ప్రయోగించింది ఇస్రో. తాజాగా 36 ఉపగ్రహాలను నింగిలోకి ప్రయోగించనుంది. దీనికోసం లాంచ్ వెహికల్ మార్క్-3 (LVM 3) ద్వారా వాటన్నింటినీ కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది ఇస్రో. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఆదివారం ఉదయం 9 గంటలకు ఆయా ఉపగ్రహాలను మోసుకుంటూ ఎల్వీఎం 3 నింగిలోకి దూసుకెళ్లనుంది.
Also Read : ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో విస్తరణ.. నాగోల్ లైన్ ఎల్బీనగర్‌కు జోడించనున్నట్టు ప్రకటన
నిజానికి- ఈ ప్రాజెక్ట్ కోసం గతంలో రష్యా సహాయాన్ని కోరింది వన్ వెబ్ సంస్థ. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో- అంతరిక్ష కార్యకలాపాలు, సోయుజ్ రాకెట్ ప్రయోగాన్ని నిలిపివేసింది. దీనితో ఇస్రో సహకారాన్ని తీసుకుంటోంది. గ్లోబల్ బ్రాడ్ బ్యాండ్ కవరేజీని మరింత మెరుగుపర్చడానికి 588 ఉపగ్రహాల ప్రారంభించాలంటూ వన్ వెబ్ సంస్థ తన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంది. ఉక్రెయిన్ తో సుదీర్ఘకాలంగా యుద్ధాన్ని కొనసాగుతున్న నేపథ్యంలో రష్యా తన అంతరిక్ష ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేయడం వల్ల కొంత మేర జాప్యం ఏర్పడింది. దీనితో వన్ వెబ్ కంపెనీ- ఇస్రోతో పాటు ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ తో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది.
ఇవి కూడా చదవండి :
- మహిళా సాధికారితే లక్ష్యం… ఆసరా కింద రూ. 6,419.89 కోట్లు: సీఎం జగన్
- ప్రభుత్వంపై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు.. సర్కారుకు భయం అంటే ఏంటో చూపిస్తామని సవాల్
- ఉపాధి హామీ పనుల్లో బయటపడ్డ వెండి నాణేలు, పంచుకున్న కూలీలు.. కట్ చేస్తే
- నాకు జైలు శిక్షా? ఐ డోంట్ కేర్… అనర్హత వేటుపై స్పందించిన రాహుల్ గాంధీ