
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : సిట్ నోటీసులపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. దొంగలను వదిలిపెట్టి ప్రతిపక్ష నేతలకు నోటీసులివ్వడమేంటి? అని ప్రశ్నించారు. ఇవాళ తానే సిట్ అధికారులను పిలిచానని, తాను ఇంట్లో లేని సమయం చూసి సిట్ వాళ్లు తమ ఇంటికొచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద బీజేపీ మహాధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ..
Read Also : ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు?.. ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించిన హైకోర్టు, నోటీసులు జారీ
‘యువకులు కష్టపడి కోచింగ్ తీసుకుంటే వారి భవిష్యత్‌ను పేపర్ లీకేజీ వల్ల అంధకారంలో నెట్టారు. మంత్రి కేటీఆర్ దీనికి బాధ్యత వహించి ముందు రాజీనామా చేయాలి. తెలంగాణ ప్రభుత్వానికి భయమెంటో చూపిస్తాం. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. నిరుద్యోగులు అధైర్యపడొద్దు. టీఎస్‌పీఎస్సీలో అసలు దొంగలను అరెస్ట్ చేయాలి’ అని అన్నారు. జైళ్లు, కేసులు మాకు కొత్తేమి కాదని, బీజేపీ భయపడే పార్టీ కాదని బండి సంజయ్ తెలిపారు. అటు బీజేపీ నాయకురాలు విజయశాంతి మాట్లాడుతూ.. పేపర్ లీకేజీ పేరుతో వ్యాపారం జరుగుతోందని, తెలంగాణలో అసలు సిసలైన ఉద్యమం మొదలైందన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నారని, నిరుద్యోగులు మౌనం వీడి పోరాటానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు.
Also Read : బాసర ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం… యాదాద్రి తరహాలో ఆలయ అభివృద్ధి
ఇటీవల బండి సంజయ్‌కు సిట్ నోటీసులివ్వగా.. బండి హాజరుకాలేదు. దీంతో ఇవాళ మరోసారి బండి ఇంటికి వెళ్లి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. సిట్ అధికారులు వెళ్లిన సమయంలో ఇంట్లోనే బండి సంజయ్ ఉన్నారు. ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని బండిని కోరినట్లు సిట్ అధికారులు తెలిపారు. ఆ నమ్మలేని నిజాలేంటో చెప్పాలని కోరామన్నారు. రేపు హాజరుకావాల్సిందిగా బండి సంజయ్‌కు సిట్ నోటీసులు ఇచ్చింది. అయితే బండి సంజయ్ ఆదివారం సిట్ ముందు హాజరవుతారా? లేదా? అనే దానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. తనకు సిట్‌పై నమ్మకం లేదని బండి సంజయ్ చెబుతుండటంతో.. రేపు కూడా హాజరుకావడంపై డైలమా నెలకొంది.
ఇవి కూడా చదవండి :
- టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్‌కు మరోసారి సిట్ నోటీసులు…
- అడిషనల్ ఎస్పి ఏడీగా బాధ్యతలు చేపట్టిన వి.శ్రీనివాసరావు…..
- బండి సంజయ్‌పై మంత్రి హరీశ్ రావు ఫైర్… ట్విట్టర్ వేదికగా బండి సంజయ్‌కు ప్రశ్నలు
- కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు.. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందన్న రేవంత్
- చంద్రబాబుకు వెన్నపోటు బాగా అలవాటు… ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై మంత్రి రోజా
One Comment