
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఒకరి వేళ్లతో మరొకరు కళ్లు పొడుచుకోవాలని చూస్తూ మొత్తం రాజకీయ వ్యవస్థనే భ్రష్టు పట్టించొద్దని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ సూచించారు. ప్రతి చిన్న విషయానికీ అనర్హతను అస్త్రంగా ఉపయోగిస్తే ప్రజాస్వామ్యం క్షీణించిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ‘అనర్హత వేటు’ అంశంపై ఆయన సుదీర్ఘ అనుభవంతో కీలక విషయాలను చెప్పారు. ఈ కేసు నుంచి రాజకీయ పార్టీలు, ప్రజలతో పాటు న్యాయస్థానాలు ఏం నేర్చుకోవాలో వివరించారు. ‘నేరస్థులకు రాజకీయాల్లో ప్రవేశం ఉండకూడదు. చట్టాన్ని ఉల్లంఘించే వారు చట్ట నిర్మాతలు కాకూడదు. అదే సమయంలో మొహం మీద కోపంతో ముక్కును కోసుకోకూడదు. ఎన్నికల మీద, ప్రజాస్వామ్యం మీద ప్రజలకు విశ్వాసం పోకూడదు’ అని జయప్రకాష్ నారాయణ అన్నారు. రాహుల్ గాంధీ అనర్హత వ్యవహారంపై ఎన్నికల సంఘం కూడా తొందరపాటు నిర్ణయం తీసుకుంటే రాజకీయంగా ఎలాంటి గందరగోళ పరిస్థితి తలెత్తే ముప్పు ఉందో ఆయన వివరించారు.
Read Also : ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో విస్తరణ.. నాగోల్ లైన్ ఎల్బీనగర్‌కు జోడించనున్నట్టు ప్రకటన
ఈ వ్యవహారం బీజేపీకి ఎలా నష్టం చేస్తుందో పరోక్షంగా హెచ్చరించారు. ‘సుప్రీంకోర్టు 2013లో మంచి ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయమే కావొచ్చు.. కానీ, కాస్త తొందరపడిందనే చెప్పాలి. అప్పటికే చట్ట సభలో సభ్యుడిగా ఉన్న వ్యక్తికి రెండేళ్ల శిక్ష పడితే అతడు/ఆమె అనర్హులవుతారని ప్రకటించింది. అయితే, అప్పీల్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చి, అప్పటివరకూ శిక్ష అమలు కాకుండా వెసులుబాటు ఇచ్చింది. దీని వెనుక ఉన్న ఉద్దేశాన్ని దూరదృష్టితో చూడాలి’ అని జయప్రకాష్ నారాయణ అన్నారు. రాహుల్ గాంధీకి పై కోర్టులో అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఉందని.. ఒకవేళ పై కోర్టులో శిక్షను తగ్గించినట్లయితే, అనర్హత వేటును వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుందని జయప్రకాష్ నారాయణ వివరించారు. ఇలాంటి సందర్భంలో లోక్‌సభ అధికారులు రాహుల్‌పై వెంటనే అనర్హత వేటు వేయకుండా, కాస్త వేచి చూస్తే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read : మహిళా సాధికారితే లక్ష్యం… ఆసరా కింద రూ. 6,419.89 కోట్లు: సీఎం జగన్
ఓ వ్యక్తి పదవిలో కొనసాగుతున్నప్పుడు పై కోర్టు ఖరారు చేస్తే తప్ప.. మళ్లీ ఉపఎన్నికకు దారి తీసేలా అనర్హత వేటు ప్రకటించడం మంచిది కాదని, చట్టం కూడా అదే చెప్తోందని ఆయన అన్నారు. ‘ఇప్పుడు ఎన్నికల సంఘం కూడా ఇదే పొరపాటు చేసి వయనాడ్‌లో ఉపఎన్నికకు నోటిఫికేషన్ ఇస్తే, అక్కడ మరో వ్యక్తి ఎంపీగా ఎన్నికైతే.. ఇదే సమయంలో రాహుల్ గాంధీ అనర్హతను పైకోర్టు రద్దు చేస్తే.. అప్పుడు రాజకీయం గందరగోళంలో పడుతుంది. ఇలాంటి సమస్య తలెత్తకుండా ఏం చేయాలో నిపుణులతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి’ అని జేపీ సూచించారు. రాహుల్ గాంధీ విషయంలో చేసిన నేరానికి, పడిన శిక్షకు చాలా వ్యత్యాసం కనిపిస్తోందని జయప్రకాష్ నారాయణ అన్నారు. ‘ఏ ప్రజాప్రతినిధి అయినా.. ఉద్దేశపూర్వకంగానైనా, లేకపోయినా ఓ కులం పేరు చెప్పి, ఇంటి పేరు చెప్పి దూషించడం పొరపాటే.
Read Also : ప్రభుత్వంపై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు.. సర్కారుకు భయం అంటే ఏంటో చూపిస్తామని సవాల్
కానీ, పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్లు చిన్న చిన్న కారణాలకే అనర్హత వేటు వేయడం సరికాదు. అలాగైతే నూటికి 99 మంది తమ పదవులను కోల్పోవాల్సి వస్తుంది’ అని ఆయన వివరించారు. గతంలో జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్ సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారని.. అయితే వాళ్ల అనర్హతపై బలమైన కారణాలున్నాయని, ఆ కేసులను రాహుల్ గాంధీ వ్యవహారంతో పోల్చడం సరికాదని జేపీ చెప్పారు. ‘లోక్‌సభ అధికారులు కూడా అత్యుత్సాహంతో అనర్హతను వెంటనే అమలు చేయాల్సిన అవసరం లేదు. న్యాయ నిపుణుల సలహా తీసుకొని, అవసరమైతే సుప్రీం కోర్టు సలహాకి పంపించి నిర్ణయం తీసుకుంటే బాగుండేది. రాజకీయ పార్టీలు తప్పులు చేయొచ్చు. కానీ, అవి లక్షలాది మంది ఆశలను, కలలను మోసేవి. కీలక నాయకులను సాంకేతిక కారణాలు చూపించి.. ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు’ అని జయప్రకాష్ నారాయణ అన్నారు.
- ఉపాధి హామీ పనుల్లో బయటపడ్డ వెండి నాణేలు, పంచుకున్న కూలీలు.. కట్ చేస్తే
- నాకు జైలు శిక్షా? ఐ డోంట్ కేర్… అనర్హత వేటుపై స్పందించిన రాహుల్ గాంధీ
- ధర్నాచౌక్ వద్ద బీజేపీ మహాధర్నాలో పాల్గొన్న బండి సంజయ్… సిట్ నోటీసులపై ఆగ్రహం
- ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు?.. ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించిన హైకోర్టు, నోటీసులు
One Comment