
క్రైమ్ మిర్రర్, గండిపేట్ : తెలంగాణ పోలీస్ అకాడమి లో అసిస్టెంట్ డైరెక్టర్ గా వి. శ్రీనివాసరావును నియమించారు. 1996 బ్యాచ్ లో ఆర్మడ్ ఎస్ఐగా వరంగల్ రేంజ్ లో భర్తీ అయిన ఆయన ట్రైనింగ్ తర్వాత ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో రిజర్వ్ ఎస్ఐ పనిచేసి ఎన్నో ఎన్కౌంటర్లలో పాల్గొని 6 గురు తీవ్రవాదులను మట్టుపెట్టారు. ఆదిలాబాద్ లో 1998 లోజరిగిన ఈ ఎన్ కౌంటర్ లో అప్పటి డిజిపితో ప్రత్యేక క్యాష్ రివార్డ్ పొందారు. 2006 లో ఆర్ఐగా ప్రమోషన్ పొంది కరీంనగర్, ఖమ్మంలలో పనిచేశారు. 2017 డీఎస్పీ ఏఆర్‌గా ప్రమోషన్ పొంది రాచకొండలో పనిచేశారు. వీఐపీల భద్రత అధికారిగా పనిచేసి కమీషనర్ మన్ననలను పొందారు. 2021 లో తెలంగాణ పోలీస్ అకాడమీ లో ఔట్ డోర్ డీఎస్పీగా చేరారు. ప్రభుత్వం 1996 బ్యాచ్ ఆర్మ్డ్ డి ఎస్పి లకు 11 మందికి అడిషనల్ ఎస్ పి లుగా ప్రమోషన్ ఇచ్చారు. వీటిలో శ్రీనివాస్‌రావుకు ప్రమోషన్ ఇస్తూ పోస్టింగ్ ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీస్ అకాడమి డైరెక్టర్ సందీప్ శాండిల్య ను మర్యాద పూర్వకంగా కలిసి ఏడీగా భాద్యతలు స్వీకరించారు. అకాడమి అధికారులందరూ శ్రీనివాసరావు కు అభినందనలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి :
- టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్‌కు మరోసారి సిట్ నోటీసులు…
- బండి సంజయ్‌పై మంత్రి హరీశ్ రావు ఫైర్… ట్విట్టర్ వేదికగా బండి సంజయ్‌కు ప్రశ్నలు
- కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు.. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందన్న రేవంత్
- మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఉద్యమం మరింత ఉధృతం… కార్యాచరణ ప్రకటించిన ఎమ్మెల్సీ కవిత
- హైదరాబాద్‌లో మరోసారి ఈడీ దాడుల కలకలం… కన్సల్టెన్సీ సంస్థల్లో సోదాలు
One Comment