
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గత కొద్దిరోజులుగా ఉద్యమం చేస్తోన్నారు. తాజాగా ఈ ఉద్యమాన్ని ఆమె మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. దీని కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. దేశంలోని పలువురు మేధావులకు పోస్టు కార్డులు రాయడంతో పాటు కాలేజీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, మిస్డ్ కాల్స్ కార్యక్రమం చేపట్టేలా రూట్‌మ్యాప్‌ను సిద్దం చేశారు. శుక్రవారం తన కార్యాచరణను కవిత ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలు, ఫ్రొఫెసర్లకు పోస్టు కార్డులు రాసి మద్దతు ఇవ్వాల్సిందిగా కవిత కోరనున్నారు.
Read Also : హైదరాబాద్‌లో మరోసారి ఈడీ దాడుల కలకలం… కన్సల్టెన్సీ సంస్థల్లో సోదాలు
అలాగే దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీలు, యూనివర్సిటీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, చర్చలు నిర్వహించనున్నారు. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లును డిమాండ్ చేస్తూ మిస్డ్ కాల్ కార్యక్రమం చేపట్టనున్నారు. వచ్చే నెలలో ఈ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు ప్రాధాన్యం కాకూడదు? అని కవిత ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు కూడగట్టేలా కవిత కార్యాచరణ రూపొందించారు. ఇప్పటికే మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం దేశ రాజధాని ఢిల్లీలో కవిత ఒకరోజు మౌనదీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. భారత జాగృతి ఆధ్వర్యంలో జరిగిన ఈ దీక్షలో దేశవ్యాప్తంగా ఉన్న పలు మహిళా సంఘాలతో పాటు 16 రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి.
Also Read : రచ్చకెక్కిన మంచు బ్రదర్స్ గొడవ…. వీడియోను బయటపెట్టిన మనోజ్
ఆ తర్వాత ఢిల్లీలో వివిధ పార్టీలు, ప్రజాసంఘాలతో కవిత రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత ఈడీ విచారణతో కాస్త గ్యాప్ రాగా.. ఇప్పుడు ఉద్యమాన్ని కవిత మరింత ఉధృతం చేయనున్నారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు మూడుసార్లు ఈమె ఈడీ విచారణకు హాజరయ్యారు. కవిత తదుపరి విచారణ ఎప్పుడు ఉంటుందనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే మరోసారి కవితకు ఈడీ నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది.
ఇవి కూడా చదవండి :
- హైదరాబాద్‌లో బాలిక కిడ్నాప్ కలకలం… సొంత బంధువులే కిడ్నాప్ చేసి ఉంటారని తండ్రి ఫిర్యాదు
- చంద్రబాబుకు వెన్నపోటు బాగా అలవాటు… ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై మంత్రి రోజా
- ఈ నెల 29న హైదరాబాద్‌లో టీడీపీ బహిరంగ సభ.. పాల్గొననున్న చంద్రబాబు
- సిట్‌పై నాకు నమ్మకం లేదు… సిట్‌కు బండి సంజయ్ కీలక లేఖ
- టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్… ఓయూలో భారీగా పోలీసుల మోహరింపు
One Comment