
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే ఈ కేసులో 9 మందిని అరెస్టు చేసిన పోలీసులు.. ఐదో రోజున వారిని 7 గంటల పాటు విచారించారు. విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులు వెల్లడించిన వివరాల ఆధారంగా ఈ కేసులో సిట్ అధికారులు నిన్న (మార్చి 22న) మరో ముగ్గురిని అరెస్టు చేశారు. టీఎస్‌పీఎస్సీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 20 మంది వరకు ఉద్యోగులు గతేడాది నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష రాశారు. వారిలో 8 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు.
Read Also : తెలంగాణ పెండింగ్ బిల్లుల కేసులో కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు.. విచారణ ఈ నెల 27కు వాయిదా
సురేశ్, దామెర రమేష్ కుమార్, షమీమ్ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షల్లో 100కు పైగా మార్కులు సాధించారు. ఈ ముగ్గురూ లీకైన పరీక్షా పేపర్ల ద్వారానే మార్కులు తెచ్చుకున్నట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. వీరిలో సురేశ్ అనే వ్యక్తి కేసులో ఏ 2 గా ఉన్న రాజశేఖర్ రెడ్డికి స్నేహితుడిగా పోలీసులు గుర్తించారు. ఇక ఈ వ్యవహారంతో ఇప్పటికే గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షతో పాటు అసిస్టెంట్ ఇంజనీర్ (AE), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE), డివిజనల్ అకౌంటెంట్ ఆఫీసర్ (DAO) పరీక్షలను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. మార్చి 12న జరగాల్సిన టౌన్ ప్లానింగ్, మార్చి 15న జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలనూ కూడా వాయిదా వేసింది.
Also Read : టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసు.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం
రద్దైన పరీక్షలను త్వరలో నిర్వహిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌లో జరగాల్సిన మరో నాలుగు పరీక్షలు కూడా వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. లీకేజీ వ్యవహరంతో అప్రమత్తమైన టీఎస్‌పీఎస్సీ… ఇక నుంచి జరిగే పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ప్రతి పరీక్షకూ బయోమెట్రిక్ అటెండెన్స్‌తో పాటు పరీక్షలు నిర్వహించే సెంటర్లలో ప్రతి రూమ్లోనూ సీసీ కెమెరాలు, ప్రతి సెంటర్ ఎంట్రెన్స్‌లో మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. దాంతో పాటు ఎక్కువగా కంప్యూటర్ బెస్డ్ ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ అధికారులు యోచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- చంద్రబాబు పగటికలలు కంటున్నారు. కనమనండి… మంత్రి ఆర్కే రోజా సెటైర్లు
- నేను బతికే ఉన్నా… ప్రముఖ నటుడు కోటా శ్రీనివాస్ రావు వీడియో రిలీజ్
- పాకిస్థాన్ నుంచి బెదిరింపు కాల్స్… గన్ లైసెన్స్ కోసం డిజిపికి రాజాసింగ్ లేఖ
- సిట్ కు ఆ దమ్ముందా?… లాజిక్ తో కొట్టిన బండి సంజయ్!!
- కోరలు చాస్తున్న వాయు కాలుష్యం… పాత బ్యాటరీలతో కొత్త మెరుగులు, మరి అనుమతులు ఏమైనట్లు….?
2 Comments