
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు పంట నష్టం జరిగిన నేపథ్యంలో.. సీఎం కేసీఆర్ గురువారం రోజున నాలుగు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎంఓ ప్రకటన విడుదల చేసింది. భారీ వర్షాలు, వడగళ్లు కురిసిన ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. వర్షాల కారణంగా నష్టపోయిన పంటపొలాలను పరిశీలించి.. రైతులను కలిసి పరామర్శించి వారికి భరోసా కల్పించనున్నారు. అయితే.. రేపు ఆయా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో.. అధికారులు భద్రత పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Also : నేడు సిట్ ఎదుటకు టీపీపీసీ రేవంత్… TSPSC పేపర్ల లీక్ ఆరోపణలపై వివరణ
కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండలంలో ఇటీవల కురిసిన వడగండ్ల వానతో తీవ్రంగా పంట నష్టపోయిన రైతులను కలిసి పరిస్థితిని సమీక్షించనున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అధికారులు పంట నష్టంపై నివేదిక తయారు చేశారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించనున్నట్టు సమాచారం. కేసీఆర్ రాక సందర్భంగా జిల్లా కలెక్టర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు, అదనపు కలెక్టర్లతో కలిసి రామడుగు మండలంలో పర్యటన కలెక్టర్ కర్ణన్ ఏర్పాట్లను పరిశీలించారు. పంటనష్టంపై సమగ్ర నివేదికతో అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. సీఎం జిల్లాకు చేరుకొని తిరిగి వెళ్లెవరకూ పక్కా ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఇవి కూడా చదవండి :
- టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు… మరో నాలుగు పరీక్షలు వాయిదా ?
- తెలంగాణ పెండింగ్ బిల్లుల కేసులో కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు.. విచారణ ఈ నెల 27కు వాయిదా
- టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసు.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం
- పాకిస్థాన్ నుంచి బెదిరింపు కాల్స్… గన్ లైసెన్స్ కోసం డిజిపికి రాజాసింగ్ లేఖ
One Comment