
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఇటీవల కురిసిన వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను సీఎం కేసిఆర్ ఇవాళ పరిశీలించారు. ముందుగా ఖమ్మం జిల్లా రావినూతలలో పర్యటించిన సీఎం.. వడగళ్ల వాన వల్ల నష్టం జరిగిన పంటలను పరిశీలించారు. భారీ వర్షం కారణంగా నేలకొరిగిన మొక్కజొన్న పంటను పరిశీలించి రైతులతో ముచ్చటించారు. పంట నష్టంపై రైతులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన నష్టపోయిన రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు. ఎకరాకు రూ. 10 వేల ఆర్థిక సాయం ప్రకటించారు. అనంతరం అక్కడి నుంచి మహబూబాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లారు. మహబూబాబాద్ చేరుకున్న సీఎం.. బిజీ షెడ్యూల్ బిజీ కారణంగా బస్సులోనే మధ్యాహ్న భోజనం చేశారు.
Read Also : ప్రధాని మోదీతో కోమటిరెడ్డి భేటీ… పార్టీ మార్పు ఖాయమంటున్న రాజకీయ విశ్లేషకులు
సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు నిరంజన్ రెడ్డి, సత్యవతి రాథోడ్, రైతుబంధు అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, సీఎస్ శాంతి కుమారి, సీఎంవో అధికారిణి స్మితా సబర్వాల్ ఇతర అధికారులు బస్సులోనే భోజనం చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రులు, అధికారులకు కొసరి కొసరి వడ్డించారు. భోజనం అనంతరం సీఎం కేసీఆర్, మంత్రులు, ఇతర అధికారులు పెద్దవంగర మండలం రెడ్డికుంటతండాకు చేరుకున్నారు. క్షేత్రస్థాయిలో కలియతిరుగుతూ దెబ్బతిన్న మిర్చి, మామిడి పంటలను పరిశీలించారు. రైతులను అడిగి నష్టం వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. నష్టపోయిన ప్రతిరైతును ఆదుకుంటామని ఈ సందర్భంగా చెప్పారు. నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ. 10 వేల ఆర్థిక సాయం అందిస్తామని అన్నారు.
Also Read : అన్నదాతకు అండగా ఉంటాం… పంట నష్టపరిహారం ప్రకటించిన సీఎం కేసీఆర్
ఈ ప్రకటన హైదరాబాద్ నుంచే చేయొచ్చునని.., రైతులకు భరోసా నింపాలనే ఉద్దేశ్యంతోనే ఇక్కడి దాకా వచ్చానని చెప్పారు. తెలంగాణలో అన్ని రకాల పంటలు కలిపి 75 నుంచి 80 లక్షల ఎకరాలు సాగులో ఉందని కేసీఆర్ వెల్లడించారు. కేవలం వరి పంటే.. 56 లక్షల ఎకరాల్లో సాగవుతుందని చెప్పారు. వ్యవసాయంలో మంచి వృద్ధిని తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయంతో కూడా జీడీపీకి లాభం ఉంటుందని కష్టపడి రుజువు చేశామని అన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. కౌలు రైతులను కూడా ఆదుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారు. రైతులను, కౌలు రైతులను కలెక్టర్ పిలిచి మాట్లాడతారని చెప్పారు. రైతులు అధైర్య పడొద్దని.. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి :
- 2019 ఎన్నికల ప్రచారంలో ప్రధానిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష
- నేడు నాలుగు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన… నష్టపోయిన పంట పొలాలను పరిశీలించనున్న కేసీఆర్
- నేడు సిట్ ఎదుటకు టీపీపీసీ రేవంత్… TSPSC పేపర్ల లీక్ ఆరోపణలపై వివరణ
- టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు… మరో నాలుగు పరీక్షలు వాయిదా ?
One Comment