
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సిట్ అధికారులు ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ఆరోపణల మీద దృష్టి సారించి ఆధారాలు ఇవ్వాలంటూ నోటీసులు పంపడంపై బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సిట్ అధికారులను లాజికల్ గా ప్రశ్నించిన బండి సంజయ్, టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజ్ వ్యవహారంలో తన పాత్ర ఉందంటూ ఆరోపణలు చేసిన మంత్రి కేటీఆర్ కు ఆధారాలు సమర్పించాలని నోటీసులు ఇచ్చే దమ్ము సిట్ కు ఉందా అంటూ ప్రశ్నించారు. తనపై చేస్తున్న ఆరోపణలకు సంబంధించి కేటీఆర్ ను పిలిచి విచారించే ధైర్యం సిట్ అధికారులకు ఉందా అంటూ నిలదీశారు.
Read Also : అకాల వర్షంతో రైతన్నలకు అపార నష్టం… పాట రూపంలో రైతన్న ఆవేదన పాట వైరల్
సిట్ నోటీసుల పేరుతో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ అసహనం వ్యక్తం చేశారు. అసలు కుట్రకు కారకులైన వారిని వదిలేసి విపక్షాలకు నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో అసెంబ్లీలో తన కొడుకు, తన బిడ్డ తప్పు చేసినా ఉపేక్షించేది లేదని చెప్పారని గుర్తు చేసిన బండి సంజయ్, కెసిఆర్ కి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా విపక్షాలకు నోటీసులు ఇవ్వడం కంటే ముందు కేటీఆర్ కు నోటీసులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. సిట్ నోటీసులకు తాము భయపడేది లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. సిట్టింగ్ జడ్జితో ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారాన్ని విచారణ జరిపించడానికి కేసీఆర్ కు ఏంటి ఇబ్బంది అంటూ ప్రశ్నించారు.
Also Read : గోవిందరాజుల పూజారి దారుణ హత్య… బండరాళ్లతో తల మీద కొట్టి చంపిన దుండగులు
తన కొడుకు తప్పు చేయలేదని కేసీఆర్ భావిస్తే తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని అప్పుడే తమ వద్ద ఉన్న సమాచారాన్ని అందిస్తామని పేర్కొన్నారు. సిట్టింగ్ జడ్జితో ఈ కేసును విచారణ జరిపించే వరకు పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు బండి సంజయ్. ఇక ఇదే సమయంలో కేసీఆర్ జేబు సంస్థగా సిట్ మారిందని, గతంలో డ్రగ్స్ కేసును, నయుం డైరీ, మియాపూర్ భూముల కేసులలో సిట్ విచారణకు ఆదేశించి నీరుగార్చడం ఇందుకు ఉదాహరణ అని, కెసిఆర్ కు ప్రయోజనం చేకూర్చేలా సిట్ లు పనిచేశాయని బండి సంజయ్ ఆరోపించారు. సిట్ నోటీసుల పేరుతో బెదిరించినంత మాత్రాన ఈ వ్యవహారాన్ని విడిచి పెట్టేది లేదని బండి సంజయ్ తేల్చి చెప్పారు.
ఇవి కూడా చదవండి :
- స్కూల్ కమిటీ ఛైర్మన్ నిర్వాహకం… తరగతి గదిలోనే మిర్చి పంట ఆరబోత
- కోరలు చాస్తున్న వాయు కాలుష్యం… పాత బ్యాటరీలతో కొత్త మెరుగులు, మరి అనుమతులు ఏమైనట్లు….?
- స్కూల్ కమిటీ ఛైర్మన్ నిర్వాహకం… తరగతి గదిలోనే మిర్చి పంట ఆరబోత
- ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి బలి
- తెలంగాణ గడ్డపై కాషాయం జెండా !… పక్కా వ్యూహాంతో ఎన్నికలకు కమలదళం