
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ పెండింగ్ బిల్లుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అయితే.. తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై నిన్న విచారణ కూడా జరిగింది. అయితే.. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపకుండా.. పెండింగ్‌లో పెట్టుకున్నారని ప్రభుత్వం ఆరోపించింది. అయితే.. ఇరువైపులా వాదనలు విన్న జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం గవర్నర్‌కు నోటీసులు ఇవ్వటం కుదరదని తెలిపింది.
Read Also : టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసు.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం
అయితే.. ఈ కేసులో ప్రతివాదులుగా కేంద్ర ప్రభుత్వాన్ని, రాజ్‌భవన్ కార్యదర్శిని చేర్చింది. కాగా.. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది సుప్రీ కోర్టు. మరోవైపు.. నిన్న జరిగిన విచారణలో తెలంగాణ ప్రభుత్వ వాదనలపై సొలిసిటర్ జనగర్ తుషార్ మెహతా అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్‌కు నోటీసులు ఇస్తే అది తప్పుడు సందేశం అవుతుందన్నారు. అయితే.. పది బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపలేదని తెలంగాణ ప్రభుత్వం చెబుతోందని.. కానీ ఇందులో కొన్ని బిల్లులు ఇటీవలే రాజ్‌భవన్‌కు చేరుకున్నాయని వివరించారు.
Also Read : చంద్రబాబు పగటికలలు కంటున్నారు. కనమనండి… మంత్రి ఆర్కే రోజా సెటైర్లు
పూర్తి వివరాలను తాను తెలంగాణ రాజ్‌భవన్ నుంచి తెలుసుకోవాల్సి ఉందని.. అందుకు కొంత సమయం ఇవ్వాలని ధర్మాసనాన్ని తుషార్ కోరారు. ఏయే బిల్లులు పరిశీలనలో ఉన్నాయో.. ఆమోదం పొందకుండా ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయో గవర్నర్‌తో మాట్లాడి వివరాలను తీసుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు. తుషార్ విజ్ఞప్తిపై స్పందించిన ధర్మాసనం.. అన్ని వివరాలను తెప్పించుకుని న్యాయస్థానానికి తెలియజేయాలని సూచించింది. మరోవైపు దీనిపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తెలియజేయాలంటూ ఆదేశించింది. తదుపరి విచారణకు ధర్మాసనం.. ఈ నెల 27కు వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి :
- నేను బతికే ఉన్నా… ప్రముఖ నటుడు కోటా శ్రీనివాస్ రావు వీడియో రిలీజ్
- పాకిస్థాన్ నుంచి బెదిరింపు కాల్స్… గన్ లైసెన్స్ కోసం డిజిపికి రాజాసింగ్ లేఖ
- సెల్‌ఫోన్లతో ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత… మూడోసారి ఈడీ విచారణకు హాజరు
- స్కూల్ కమిటీ ఛైర్మన్ నిర్వాహకం… తరగతి గదిలోనే మిర్చి పంట ఆరబోత
- సిట్ కు ఆ దమ్ముందా?… లాజిక్ తో కొట్టిన బండి సంజయ్!!
One Comment