HyderabadTelangana

నేను బతికే ఉన్నా… ప్రముఖ నటుడు కోటా శ్రీనివాస్ రావు వీడియో రిలీజ్

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు చనిపోయినట్లు ఇవాళ ఉదయం నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హైదరాబాద్ లోని నివాసంలో ఆయన కన్నుమూసినట్లు ఆ వార్తల సారాంశం. అసలే టాలీవుడ్ లో పలువురు దిగ్గజ నటులు ఈ మధ్య వరుసగా చనిపోయిన నేపథ్యంలో వయో వృద్ధుడైన కోటా శ్రీనివాసరావు కూడా చనిపోయినట్లు పలువురు భావించారు కూడా. ఆయన అభిమానులైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టడం మొదలుపెట్టారు. అంతేకాదు కోటా శ్రీనివాసరావు మరణంపై వచ్చిన పుకార్లతో హైదరాబాద్ లోని ఆయన నివాసం వద్దకు పోలీసులు కూడా భద్రత కల్పించేందుకు వచ్చారు. కోటా గురించి తెలిసిన వారే కావడంతో స్ధానిక పోలీసులు ఆయన మరణ వార్త తెలుసుకుని వచ్చే వారితో ఎలాంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా భద్రత కల్పించేందుకు వచ్చారు.

Read Also : సెల్‌ఫోన్లతో ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత… మూడోసారి ఈడీ విచారణకు హాజరు

అలాగే కోటా శ్రీనివాసరావు చనిపోయారా అంటూ ఆయన ఫోన్ కే ఉదయం నుంచి ఫోన్లు కూడా వస్తున్నాయి. దీంతో ఆయన షాకవుతూనే సమాధానం ఇస్తున్నారు. ఇక వీటికి అడ్డుకట్ట వేద్దామని భావించి ఆయనే దీనిపై క్లారిటీ ఇస్తూ ఓ వీడియో బైట్ విడుదల చేశారు. తాను బతికే ఉన్నానని, తన అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టాలీవుడ్ నట దిగ్గజం కోటా శ్రీనివాసరావు తెలిపారు. ఇలాంటి వార్తలు ఇచ్చే ముందు సరిచూసుకోవాలని మీడియాకు ఆయన విజ్ఞప్తి చేశారు. తన మరణవార్త పేరుతో వస్తున్న పుకార్లను నమ్మొద్దని తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల్ని కోటా కోరారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, రేపు ఉగాది కావడంతో పండుగ ఏర్పాట్లలో ఉన్నానని కూడా క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నవారందరికీ గట్టి షాక్ తగిలినట్లయింది.

ఇవి కూడా చదవండి : 

  1. పాకిస్థాన్ నుంచి బెదిరింపు కాల్స్… గన్ లైసెన్స్ కోసం డి‌జి‌పికి రాజాసింగ్ లేఖ
  2. సిట్ కు ఆ దమ్ముందా?… లాజిక్ తో కొట్టిన బండి సంజయ్!!
  3. స్కూల్ కమిటీ ఛైర్మన్ నిర్వాహకం… తరగతి గదిలోనే మిర్చి పంట ఆరబోత
  4. కోరలు చాస్తున్న వాయు కాలుష్యం… పాత బ్యాటరీలతో కొత్త మెరుగులు, మరి అనుమతులు ఏమైనట్లు….?
  5. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై ప్రశాంత్‌ కిశోర్‌ సంచలన వ్యాఖ్యలు

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.