
కధనం..2
క్రైమ్ మిర్రర్, ఇన్వెస్టిగేషన్ ప్రత్యేక ప్రతినిధి : ఏటేటా పెరుగుతున్న వాయు కాలుష్యంతో ఊపిరితిత్తులు, ఇతర శ్వాసకోశ వ్యాధులతో పట్టణాలలోని ప్రజలు సతమతమవుతున్న విషయం అందరికి తెలిసిందే. అందుకే సగటు మానవుడి ఆయుష్యు రోజు రోజుకు దిగజారిపోతుంది. మానవుడికి ముఖ్యంగా కావలసిన ప్రాణవాయువు, రోజురోజుకీ పెరుగుతున్న వాహనాలు, ఫ్యాక్టరి, కంపెనీల నుండి వచ్చే కాలుష్యాల వల్ల హైదరాబాద్ వంటి ప్రధాన పట్టణాలలో, స్వచ్ఛమైన గాలి కరువైపోయింది. రోజులు మారుతున్నా కొద్ది పల్లెలకు కూడా ఈ దుస్థితి వస్తుందని చెప్పుకోవటంలో ఏమాత్రం సందేహం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం వంటి కార్యక్రమాలు చేపట్టి గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రజా శ్రేయస్సు కోసం చెట్లను పెంచుతూ పోతుంటే, ఒక పక్క వ్యాపారులు మాత్రం అదే తరహాలో కంపెనీలు పెట్టుకుంటూపోతున్నారు. డబ్బే లక్ష్యంగా వేరే వ్యాపారాలే లేవనేటట్లుగా వాయువును కాలుష్యం చేసే పనిలో పడ్డారు…! గ్రామాలలో ఐతే అడిగే వారు లేరు, భయపడే సమస్యే లేదు, అంతా మా వాల్లే అనే ఆలోచనలో ఉన్న వ్యక్తులు మాత్రమే ఈ దుస్సాహసానికి తెగిస్తున్నారని నానుడి.
Read Also : వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు
ఇక వివరాలలోకి వెళ్తే నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం నందు ఒక వ్యక్తి వినూత్నమైన కంపెనీ పెట్టి స్వచ్ఛమైన పల్లెటూరి గాలిని రాత్రి సమయాలలో కల్తీ చేసే పనిలో పడ్డారని సమాచారం…! ఇప్పటికే వయస్సుతో సంబంధం లేకుండా గుండెలు ఆగిపోతున్న సందర్భంలో ఈ నయా దుఖాణం, అందరిని భయబ్రాంతులకు గురిచేస్తుంది. అర్ధరాత్రి సమయంలో ప్రజలు నిద్రిస్తున్న వేల ఈ కంపెనీ మేలుకుంటుంది, అంతే కాదు డోస్ పెంచి మరింత గాలిని కలుషితం చేస్తుంది కూడా…. పాత ద్విచక్ర వాహనాలు, కార్లకు సంబంధించిన బ్యాటరీలను కొనుగోలు చేసి, వాటిని రెండు వైపులా సూరు కత్తులతో నరికేసి, లోపల ఉన్న పదార్థాలను, లిక్విడ్ లను బయటికి తీసి, పెద్ద పెద్ద భట్టీలలో, రసాయణాల సహాయంతో మండించి, వెండి మాదిరిగా ఉండే ఒక రకమైన ద్రావణాన్ని నిర్ణీత పరికరాలలోకి వడపోసి కడ్డీలలా తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున చెడు వాసనలు, దుమ్ము దూళితో గాలిలో కలిసిపోతున్నాయి.
Also Read : ఢిల్లీలోని ఈడీ కార్యాలయం వద్ద హైటెన్షన్… బయటకి వస్తారని చూస్తుండగా డాక్టర్ల టీమ్ ఎంట్రీ
ఈ కంపెనీ మర్రిగూడ గ్రామానికి అతి సమీపంలోనే ఉండటం వల్ల దుర్వాసనాలు వస్తున్నాయని మర్రిగూడ ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రజలు నిద్రిస్తున్న సమయం కావటంతో గుర్తించలేని గ్రామస్థులు, మరుసటి రోజు జలుబు, తలనొప్పి వంటి సమస్యలతో సతమతం అవుతున్నారని తెలుస్తుంది. ఈ వాసనలు పక్కనే ఉన్న వట్టిపల్లి గ్రామం వరకు కూడా వ్యాపిస్తున్నట్లు సమాచారం. కొన్ని రకాలైన హానికర రసాయణాలతో ఉడికించటం వల్లే, ప్రాణంతకమైన విషవాయువు బయటికి వస్తుందనే అనుమానాలు పెద్దఎత్తున వ్యక్తం అవుతున్నాయి. ఇదంతా తెలిసి కూడా కొంతమంది స్థానిక నాయకులు, సామాజిక కార్యకర్తలు స్పందించకపోవటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మునుగోడు నియోజకవర్గ స్థాయి నాయకుడి హస్తం ఉన్నందుకే, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులు, స్థానిక నాయకులు కపిష్కంత నోరు కూడా మెదపటం లేదని అనుకుంటున్నారు. దగ్గర్లోనే స్థానిక ఎలక్షన్ లు వస్తున్న వేల, ఇవన్నీ మాకెందుకు అనుకుంటూ సామాజిక కార్యకర్తలు సైతం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని భావిస్తున్నారు గ్రామ ప్రజలు. ఏదేమైనా ప్రజలు బాగుంటేనే ఏ రాజకీయమైన చేయవచ్చు అనే మాటను మరుస్తున్న యువనాయకులకు, అధికారం వస్తే మమల్ని ఏమీ పట్టించుకుంటారని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. గ్రామానికి దగ్గర్లోనే కంపెనీ ఉందని, పై బాగాన స్కూల్ కూడా ఉన్నప్పటికి దీనికి అనుమతులు ఎవరిచ్చారనే సందేహాలు ఉత్పన్నామౌతున్నాయి.
ఏదేమైనా ప్రజలు బాగుంటేనే అందరూ బాగుంటారనే అక్షర సత్యం అందరికి ముఖ్యం…..
ఈ తయారికి సంబంధించిన రవాణా, వెనుక ఉన్న నియోజకవర్గ లీడర్ గురించి మరో క్రైమ్ మిర్రర్ సంచిక ద్వారా మీ ముందుకు….
నిఘా వ్యవస్థ నిద్రిస్తే క్రైమ్ మిర్రర్ కాపు కాస్తుంది……
ఇవి కూడా చదవండి :
- గోవిందరాజుల పూజారి దారుణ హత్య… బండరాళ్లతో తల మీద కొట్టి చంపిన దుండగులు
- అకాల వర్షంతో రైతన్నలకు అపార నష్టం… పాట రూపంలో రైతన్న ఆవేదన పాట వైరల్
- తల్లి తీర్చిదిద్దిన దొంగ… బాధితుల ఫిర్యాదుతో ఎట్టకేలకు తల్లీకొడుకులు అరెస్ట్
- పెద్ద పేపర్ల పేరుతో వసూళ్ల దందాలు…. మండలంలో జరుగుతున్న భూ వ్యవహారంలో వారిదే కీలక పాత్ర..