
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ మూడోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరయ్యే ముందు కవిత.. తన సెల్‌ఫోన్లను మీడియాకు చూపించారు. మెుత్తం 9 సెల్‌ఫోన్లను మీడియాకు చూపించారు. స్పెషల్ కోర్టుకు దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ కంప్లైంట్‌లో కవిత 10 ఫోన్లు వాడినట్లు ఈడీ పేర్కొంది. 2021 సెప్టెంబర్ నుంచి 2022 ఆగస్టు వరకు కవిత మెుత్తం 10 ఫోన్లు మార్చినట్లు అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో మెుత్తం 36 మంది 170 ఫోన్లు మార్చినట్లు ఈడీ పేర్కొంది. ఆధారాలు చేరిపేసే క్రమంలో కవిత తన ఫోన్లు ధ్వంసం చేసినట్లు ఈడీ అభియోగాలు నమోదు చేసింది.
Read Also : స్కూల్ కమిటీ ఛైర్మన్ నిర్వాహకం… తరగతి గదిలోనే మిర్చి పంట ఆరబోత
ఈ క్రమంలో ఆమె తన ఫోన్లను మీడియాకు చూపించటం చర్చనీయాంశంగా మారింది. తాను ఏ తప్పు చేయలేదని.., రాజకీయ కోణంలోనే ఈడీ విచారణ జరగుతోందని కవిత ఇప్పటికే పలుమార్లు చెప్పారు. అందులో భాగంగానే ఈడీ నమోదు చేసిన అభియోగాలను తిప్పికొట్టాలనే ఉద్దేశ్యంతోనే కవిత ఇవాళ ఈడీ విచారణకు హాజరయ్యే ముందు తన సెల్‌ఫోన్లను చూపించినట్లు తెలుస్తుంది. అంతకు ముందు ఇవాళ్టి విచారణ నేపథ్యంలో ఉదయం సుప్రీం కోర్టు న్యాయవాదులతో కవిత భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు న్యాయవాదులతో చర్చించారు. న్యాయవాదులతో చర్చల అనంతరం.. ఆమె సీఎం కేసీఆర్ నివాసానికి చేరుకొని అక్కడి నుంచి తన లాయర్లతో కలిసి ఈడీ కార్యాలయానికి బయల్దేరారు.
Also Read : అకాల వర్షంతో రైతన్నలకు అపార నష్టం… పాట రూపంలో రైతన్న ఆవేదన పాట వైరల్
ఇక నిన్న సుమారు 10 గంటల పాటు ఈడీ అధికారులు కవితను విచారించారు. మెుత్తం 14 ప్రశ్నలను ఆమెపై సంధించినట్లు తెలిసింది. సౌత్ గ్రూప్ వ్యవహారాలు, అరుణ్ ఫిళ్లతో ఉన్న ఆర్థిక సంబంధాలు, హోటల్ సమావేశాలు, ఆధారాల ధ్వంసం ఇలా మెుత్తం 14 అంశాలపై ఆమెను ప్రశ్నించినట్లు తెలిసింది. ఈనెల 11న ఆమె మెుదటిసారి విచారణకు హాజరు కాగా.. ఆ సమయంలో ఆమె ఫోన్‌ను అధికారులు సీజ్ చేశారు. ఫోన్లు ధ్వంసం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈమె ఇవాళ ఫోన్లతో ఈడీ విచారణకు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి :
- సిట్ కు ఆ దమ్ముందా?… లాజిక్ తో కొట్టిన బండి సంజయ్!!
- వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు
- కోరలు చాస్తున్న వాయు కాలుష్యం… పాత బ్యాటరీలతో కొత్త మెరుగులు, మరి అనుమతులు ఏమైనట్లు….?
- గోవిందరాజుల పూజారి దారుణ హత్య… బండరాళ్లతో తల మీద కొట్టి చంపిన దుండగులు
- లండన్ లో ఇంటి అద్దె అక్షరాల రూ.2.5 లక్షలు
2 Comments