
క్రైమ్ మిర్రర్, జయశంకర్ భూపాలపల్లి ప్రతినిధి : అకాల వర్షాలు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తా్యి. భారీ ఈదురు గాలులు, వండగళ్ల వానతో రైతుల పంటలు దెబ్బతిన్నాయి. పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలు కురవటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరి, మెుక్కజొన్న, మిర్చితో పాటు ఉద్యానవన పంటలు నేలరాలాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం పంకెన గ్రామంలో ఓ రైతు తన మిర్చి పంటను గ్రామంలోని పాఠశాల తరగతి గదిలో ఆరబోశాడు. పాఠశాల స్కూల్ కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న మోతే కిష్టయ్య తన పొలంలో పండిన పంటను రాత్రికి రాత్రే పాఠశాలకు తరలించి రెండు తరగతి గదుల్లో ఆరబోశాడు.
Also Read : అకాల వర్షంతో రైతన్నలకు అపార నష్టం… పాట రూపంలో రైతన్న ఆవేదన పాట వైరల్
ఈ స్కూళ్లో 1 నుంచి 8 తరగతుల వరకు మెుత్తం 132 మంది విద్యార్థులు చదువుకుతుండగా.. నిన్న పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు ఆ దృశ్యాన్ని చూసి అవాక్కయ్యారు. క్లాస్ రూమ్‌లో మిర్చి పంటను ఆరబోస్తే.. తాము ఎక్కడ కూర్చోవాలని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. దీంతో ఆ రెండు తరగతి గదుల్లోని 3.4 విద్యార్థులను 1,2 తరగతుల విద్యార్థులతో కలిపి కూర్చొబెట్టి పాఠాలు చెప్పారు. ఈ విషయంపై రైతును ప్రశ్నించగా.. వర్షం వల్లే వేరే దారి లేక క్లాస్ రూమ్‌ల్లో మిర్చి పంటను ఆరోబోశానని తెలిపాడు. ఇప్పటికే అకాల వర్షం కారణంగా తన పంట కొంతమేర తడిసిపోయిందని.., మిగిలిన పంటను కాపాడుకోవటానికి అలా చేశానని చెప్పుకొచ్చాడు. పాఠశాల హెడ్ మాస్టర్ వెంకటేశ్వర్లు స్పందిస్తూ.. తాను సెలవులో ఉన్నానని.., రైతు మిర్చి ఆరోబోసిన విషయం తనకు తెలియదని అన్నారు. వెంటనే మిర్చిని ఖళీ చేయిస్తానని చెప్పారు.
ఇవి కూడా చదవండి :
- కోరలు చాస్తున్న వాయు కాలుష్యం… పాత బ్యాటరీలతో కొత్త మెరుగులు, మరి అనుమతులు ఏమైనట్లు….?
- గోవిందరాజుల పూజారి దారుణ హత్య… బండరాళ్లతో తల మీద కొట్టి చంపిన దుండగులు
- వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు
- ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి బలి
- దున్నపోతుకు రూ.1.5 కోట్లు ఇస్తామన్నారు.. అయినా అమ్మరట
One Comment