
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షాలు అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వరి, మెుక్కజొన్న, కూరగాయల పంటలు దెబ్బతినగా, మామిడి, బత్తాయిలు, నిమ్మ నేలరాలాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో వర్షం రావడం రైతులను తీవ్రంగా నష్టపరిచింది. కల్లాల్లో వడ్లు, చేలల్లో పంటలు చేతికొచ్చే సమయానికి రాళ్ల వర్షం పడటంతో రైతులు బోరున విలపిస్తున్నారు. తెలంగాణకు చెందిన ఓ రైతన్న పాట రూపంలో తన ఆవేదనను వ్యక్తం చేశాడు.
Also Read : ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి బలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం మర్రిగూడెం గ్రామానికి చెందిన రైతు రామ్మూర్తి.. దెబ్బతిన్న తన మొక్కజొన్న పంట చూసి ఆవేదనతో పాట పాడాడు. ఆ పాట కాస్త వైరల్‌గా మారింది. ‘పొమ్మన్న పోదు ఈ వానరా.. చేలరేగిన తుపానురా..రాకరాకొచ్చిన వానరా.. రైతు గుండెల్లో తన్నెళ్లి పోయేరా.. అవసరమైనప్పుడేదిరా..నువ్వు ఎటుమెక్కినా కానరాదురా..’ అంటూ రైతు రామ్మూర్తి తన ఆవేదనను వ్యక్తం చేశాడు. అది చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కష్టాల్లో కూడా మస్త్ పాట పాడావు అంటూ అభినందిస్తూనే.. ఆయనకు కలిగిన నష్టంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయ్యో పాపం రైతుల పరిస్థితి ఎప్పుడూ ఇంతే అంటూ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- ఢిల్లీలోని ఈడీ కార్యాలయం వద్ద హైటెన్షన్… బయటకి వస్తారని చూస్తుండగా డాక్టర్ల టీమ్ ఎంట్రీ
- రామచంద్ర పిళ్లైకి జ్యుడీషియల్ రిమాండ్.. కొనసాగుతున్న కవిత విచారణ
- ఏప్రిల్ 30న తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం…
- తల్లి తీర్చిదిద్దిన దొంగ… బాధితుల ఫిర్యాదుతో ఎట్టకేలకు తల్లీకొడుకులు అరెస్ట్
2 Comments