
క్రైమ్ మిర్రర్, అమరావతి ప్రతినిధి : ఈనెల 23న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి టీడీపీ ఇప్పటికే విప్ జారీ చేసింది. ఇటు అధికార పార్టీ కూడా అదే బాటలో నడుస్తోంది. అయితే.. అధికార పార్టీలో కొంత మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. అటువంటి వారిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గుర్తించి వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో.. చంద్రబాబును టార్గెట్ చేసి.. వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా.. మంత్రి ఆర్కే రోజా చంద్రబాబుపై ఫైర్ అయ్యారు.
Read Also : నేను బతికే ఉన్నా… ప్రముఖ నటుడు కోటా శ్రీనివాస్ రావు వీడియో రిలీజ్
‘చంద్రబాబుకు సిగ్గులేదు. పగటికలలు కంటున్నాడు.. కనమనండి. కుప్పంలో ఓడిపోయిన చరిత్రను చంద్రబాబు మరచిపోయాడు. తండ్రి, కొడుకును తరిమికొట్టినా బుద్ధి రావడంలేదు. బలం లేకపోయినా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు ఎందుకు పోటీ చేస్తున్నారు. డబ్బులతో ప్రలోభపెట్టి ఎమ్మెల్యేలను కొనడానికా. మేము జగన్ ఫోటోతో గెలిచాం. మేమందరం జగన్ వెంటే ఉంటాం. వంద శాతం అన్నీ సీట్లు మేమే గెలుస్తున్నాం. చంద్రబాబును నమ్మి ఎవరైనా ఓటు వేస్తారా?’ అని రోజా ప్రశ్నించారు. నేతల మధ్య డైలాగ్ వార్ ఇలా ఉంటే.. సీఎం జగన్‌కు ఇంటిలిజెన్స్ వర్గాలు కీలక సమాచారం చేరవేసినట్లు తెలుస్తోంది.
Also Read : పాకిస్థాన్ నుంచి బెదిరింపు కాల్స్… గన్ లైసెన్స్ కోసం డిజిపికి రాజాసింగ్ లేఖ
దీంతో ఏడో స్థానం చేజారిపోకుండా ఉండేందుకు సీఎం జగన్ రంగంలోకి దిగారు. టీడీపీకి టచ్‌లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరో ఆరా తీసే పనిలో పడ్డారు. అందుకోసం గత రెండు రోజులుగా ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. ఎలాగైనా ఏడో స్థానాన్ని గెలిచి తీరాలని ముఖ్య నేతలకు సూచిస్తున్నారు. టీడీపీ కూడా.. రంగంలోకి దించిన అభ్యర్ధి పంచుమర్తి అనురాధను గెలిపించి మండలికి పంపాలని పట్టుదలతో ఉంది. దీంతో ఇరు పార్టీల్లోనూ 23వ తేదీ టెన్షన్ కనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి :
- సెల్‌ఫోన్లతో ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత… మూడోసారి ఈడీ విచారణకు హాజరు
- సిట్ కు ఆ దమ్ముందా?… లాజిక్ తో కొట్టిన బండి సంజయ్!!
- స్కూల్ కమిటీ ఛైర్మన్ నిర్వాహకం… తరగతి గదిలోనే మిర్చి పంట ఆరబోత
- వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు
- కోరలు చాస్తున్న వాయు కాలుష్యం… పాత బ్యాటరీలతో కొత్త మెరుగులు, మరి అనుమతులు ఏమైనట్లు….?
One Comment