
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి త్వరలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనుండగా.. ఆ తర్వాత ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో భేటీ కానున్నారు. అనంతరం మంచి ముహూర్తం చూసుకుని కాషాయ తీర్ధం పుచ్చుకోనున్నారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి కిరణ్ కుమార్ రెడ్డి దూరంగా ఉంటున్నారు. ఆ పార్టీకి అంటీముట్టనట్లుగా ఉంటున్న ఆయన.. ఎక్కడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.
Read Also : పెద్ద పేపర్ల పేరుతో వసూళ్ల దందాలు…. మండలంలో జరుగుతున్న భూ వ్యవహారంలో వారిదే కీలక పాత్ర..
ఏపీలో కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలు లేకపపోవడంతో బీజేపీ నేతల ఆహ్వానంతో ఆ పార్టీలో చేరేందుకు కిరణ్ కుమార్ రెడ్డి సిద్దమయ్యారు. హైదరాబాద్ కేంద్రంగా బీజేపీలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారని చెబుతున్నారు. జాతీయ స్థాయిలో కీలక పదవి ఇస్తామని కాషాయదళం హామీ ఇచ్చిందని, అందులో భాగంగానే బీజేపీ గూటికి వెళుతున్నారని తెలుస్తోంది. డిసెంబర్‌లో తెలంగాణ ఎన్నికలు జరగనుండగా.. ఈ క్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి ఎంట్రీ బీజేపీగా ఎలా కలిసొస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
Also Read : ఆలయాల దగ్గర రాజకీయం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు… వీరేందర్ గౌడ్
తెలంగాణలో బీజేపీ బలోపేతం కోసం కిరణ్ కుమార్ రెడ్డి పనిచేస్తారని చెబుతున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా పనిచేయడంతో తెలంగాణలోని చాలామంది నేతలతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే తెలంగాణ రాజకీయాలపై కూడా ఆయనకు మంచి అవగాహన ఉంది. ఆ పరిచయాలతోనే టీ బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తారనే చర్చ జరుగుతోంది. గత కొంతకాలంగా హైదరాబాద్‌లోనే ఎక్కువగా కిరణ్ కుమార్ రెడ్డి ఉంటున్నారు. దీంతో ఇక నుంచి ఏపీ రాజకీయాలతో సంబంధం లేకుండా తెలంగాణ రాజకీయాల్లోనే ఆయన పాత్ర ఉంటుందని అంటున్నారు.
ఇవి కూడా చదవండి :
- ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు ఎమ్మెల్సీ కవిత… కేసీఆర్ నివాసం వద్ద టెన్షన్
- ముందస్తు ఎన్నికలుండవని మరోసారి స్పష్టం చేసిన కేసీఆర్…
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై మహిళా సర్పంచ్ సంచలన ఆరోపణలు..వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వొద్దంటూ విజ్ఞప్తి
- ఏప్రిల్ 30న తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం…
- మనుషులు తాకారనే కారణంతోనే… పులి పిల్లల చెంతకు రాని పెద్ద పులి