
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఢిల్లీ లిక్కర్ స్కాంలో భాగంగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణను ఎదుర్కోనున్నారు. శనివారం ఆమెను ఈడీ అధికారులు విచారించనున్నారు. ఈ నేపథ్యంలో.. ఢిల్లీలోని కేసీఆర్ నివాసం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. 10 గంటల తర్వాత తుగ్లక్ రోడ్డు నివాసం నుంచి కవిత ఈడీ ఆఫీసుకు వెళ్లారు. ఇటు బిఆర్ఎస్ ముఖ్య నేతలు, పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, భారత జాగృతి నేతలు.. ఢిల్లీకి చేరుకున్నారు. దీంతో అబ్దుల్ కలాం రోడ్‌లోని ఈడీ ఆఫీస్ పరిధిలో 144 సెక్షన్ విధించారు.
Read Also : ముందస్తు ఎన్నికలుండవని మరోసారి స్పష్టం చేసిన కేసీఆర్…
మరోవైపు ఢిల్లీలోని KCR నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇటు కవిత నివాసానికి ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, శంభిపుర్ రాజు వెళ్లారు. కవితకు మద్దతుగా నిలుస్తున్నారు. కవిత ఈడీ విచారణ నేపథ్యంలో.. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కవితమ్మా.. ధైర్యంగా ఉండండి.. పిచ్చి కుక్కల్ని వేటాడే క్రమంలో వాటి కాట్లు మన చేతిపై పడతాయి. అంతమాత్రాన వేట ఆపుతామా? కేసిఆర్ కుటుంబ సభ్యులమైన మేమంతా.. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ప్రజలు మీ ధర్మపోరాటంలో మీతోపాటు ఉన్నాం.. ఉంటాం.. ధర్మం మీ వైపు ఉంది’ అని మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి :
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై మహిళా సర్పంచ్ సంచలన ఆరోపణలు..వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వొద్దంటూ విజ్ఞప్తి
- ఏప్రిల్ 30న తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం…
- ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు… కోర్టులో పిళ్లై పిటిషన్ దాఖలు
- తల్లి తీర్చిదిద్దిన దొంగ… బాధితుల ఫిర్యాదుతో ఎట్టకేలకు తల్లీకొడుకులు అరెస్ట్
- మనుషులు తాకారనే కారణంతోనే… పులి పిల్లల చెంతకు రాని పెద్ద పులి