
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనకు వస్తున్న బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆయన కంప్లైంట్ చేశారు. తనను చంపుతామంటూ కొంతమంది బెదిరింపులకు గురి చేస్తున్నారని, చంపేస్తామంటూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారంటూ పోలీసులకు తెలిపారు. తనను బెదిరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వెంకటరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన వద్ద ఉన్న వీడియోలు చాటింగ్ లిస్ట్‌ను పోలీసులకు అందించారు.
Read Also : త్వరలో బీజేపీలోకి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి… హైదరాబాద్ కేంద్రంగానే రాజకీయాలు
దీంతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. వెంకటరెడ్డి అందించిన ఆధారాల ప్రకారం నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తోన్నారు. ఇటీవల సొంత పార్టీ నేత చెరుకు సుధాకర్, అతడి కుమారుడు డాక్టర్ సుహాస్‌లను వెంకటరెడ్డి ఫోన్‌లో బెదిరించిన ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చెరుకు సుధాకర్‌ను చంపేసేందుకు వంద కార్లలో తన నుంచి ప్రయోజనం పొందిన వారు తిరుగుతున్నారంటూ బెదిరింపులకు గురి చేశారు. నీ హాస్పిటల్ కూడా ఉండదని, కూలగొడతారంటూ సుహాస్‌పై వెంకటరెడ్డి బూతు పురాణం వల్లించారు.
Also Read : పెద్ద పేపర్ల పేరుతో వసూళ్ల దందాలు…. మండలంలో జరుగుతున్న భూ వ్యవహారంలో వారిదే కీలక పాత్ర..
చెరుకు సుధాకర్ తనను ఏడాది నుంచి తిడుతూ ఉన్నాడని, అయినా తాను భరిస్తూ వస్తున్నట్లు చెప్పారు. తాను ఊరుకున్నా తన అభిమానులు ఊరుకోరని, చంపేస్తారంటూ బెదిరించారు. ఈ ఆడియో టేప్ కాంగ్రెస్‌లో చిచ్చు రేపింది. వెంకటరెడ్డి బెదిరింపులపై పోలీసులకు చెరుకు సుధాకర్ ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు రివర్స్‌లో తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ వెంకటరెడ్డి కంప్లైంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి :
- ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు ఎమ్మెల్సీ కవిత… కేసీఆర్ నివాసం వద్ద టెన్షన్
- ఆలయాల దగ్గర రాజకీయం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు… వీరేందర్ గౌడ్
- ముందస్తు ఎన్నికలుండవని మరోసారి స్పష్టం చేసిన కేసీఆర్…
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై మహిళా సర్పంచ్ సంచలన ఆరోపణలు..వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వొద్దంటూ విజ్ఞప్తి
- తల్లి తీర్చిదిద్దిన దొంగ… బాధితుల ఫిర్యాదుతో ఎట్టకేలకు తల్లీకొడుకులు అరెస్ట్