Telangana

ఆలయాల దగ్గర రాజకీయం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు… వీరేందర్ గౌడ్

క్రైమ్ మిర్రర్, మహేశ్వరం ప్రతినిధి : మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ శ్రీనగర్ లో జరిగిన శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి తిరుకళ్యాణోత్సవం లో బిఅరెస్ పార్టీకి సంబంధించిన కొంత మంది నాయకులు దేవాలయంలో చిల్లర రాజకీయాలు చేసారని మండిపడ్డాడు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి తుళ్ళ వీరేందర్ గౌడ్ శుక్రవారం తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసారు ఈ సందర్భంగా మాట్లాడుతూ 3వ.తేదీ లో శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుకళ్యాణోత్సవం నిర్వహించారు గత మూడు సంవత్సరాలు గా వీరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో అంగరంగవైభవంగా నిర్వహిస్తూ కొనసాగిస్తుండగా ఈ సంవత్సరం కావాలనే మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆలయ కమిటీ వేసి గుడిదగ్గర కూడ రాజకీయాన్ని చేసారని ఆరోపించారు.గుళ్ళ దగ్గర కూడ నీచ రాజాకీయం చేయడం అవసరమా అని మండిపడ్డారు.

Read Also : ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు ఎమ్మెల్సీ కవిత… కేసీఆర్ నివాసం వద్ద టెన్షన్

virendar goud - Crime Mirror

అభివృద్ధి చేయాలనుకుంటే మహేశ్వరం నియోజక వర్గంలో పాఠశాలలపై,కళాశాలలలపై దృష్టి పెట్టాలన్నారు ప్రతి సంవత్సరం కల్యాణానికి మంఖాల్ గ్రామం నుండి స్వామివారిని రథంపై ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయంలోకి స్వామివారిని ఎదురుకోళ్లు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అందులో కూడ బిఅరెస్ నాయకులు బుట్లు వేసుకొని స్వామి వారి రథాన్ని లాగరని హిందూ ధర్మాన్ని మంట కలిపరని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కూడ బుట్లు వేసుకొని రథం లాగడం బిఅరెస్ పార్టీ నాయకులు తాగి వచ్చి రథం లాగరన్నారు. గుడిలో కూడ రాజకీయం చేస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డిని స్వామి వారు కల్యాణం కూడ చూడనియలేదని అన్నారు.మంచి చేసేవారికి స్వామి వారి అనుగ్రహము తప్పకుండా వుంటుందనే విషయం తెలుసుకోవాలని అన్నారు.స్వార్ధ రాజకీయాలతో ఆలయాన్ని చెడగొడుతున్నారని బడి పై లేని దృష్టి హాస్పిటల్స్ పై లేని దృష్టి ఆలయాలపై ఎందుకు పెట్టారని మంత్రిని ప్రశ్నించారు? అభివృద్ధి పై దృష్టి పెట్టాలి.ప్రతి గ్రామానికి వెళ్లి మీరు చేస్తున్న అఘాయిత్యాలను ప్రజలకు తెలిసేలా కాలికి గజ్జ కట్టుకొని వివరిస్తానని వ్యాఖ్యానిస్తారు. 48 ఎకరాలు మొత్తం భూమి స్వామివారికి చెందాలని ఒక్క ఇంచ్ స్థలం కూడా ప్రయివేట్ వ్యక్తులకు చెందనివ్వనని వీరేందర్ గౌడ్ అన్నారు.

Also Read : ముందస్తు ఎన్నికలుండవని మరోసారి స్పష్టం చేసిన కేసీఆర్…

ఆలయం చుట్టూ16 ఎకరాల భూమి సుమారు160 కోట్ల విలువ ఉంటుందని దానిని భూకబ్జాలు చేస్తున్న బిఅరెస్ పార్టీ వాళ్ళు ఓ ప్రయివేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చేశారన్నారు. నెల ఆఖరు వరకు సమయం ఇస్తున్నాము కట్టిన ప్రహరీ గోడను కుల గొట్టాలని లేదా మేము వచ్చి కుల గోడతాం అని హెచ్చరించారు.ఎట్టి పరిస్థితులలో కబ్జా చేయనియమని తెలిపారు. మంత్రి ఒకసారి ఆలోచించండి మీ దగ్గరున్న కార్య కర్తలే మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు.అలాంటి వారిని దూరం పెట్టండి రావిర్యాల,బడన్గ్ పెట్,బాలాపూర్,మహేశ్వరం, పహడి షరీఫ్ దగ్గర, మీ కార్యకర్తలే కబ్జాలకు పాల్పడుతున్నారని,మంత్రికి సూచించారు.పహడి షరీఫ్,బర్కస్,ని తప్పియడం కోసం ఏర్పోర్టు కు దారిని అప్పట్లో దేవేందర్ గౌడ్ మూడు దారులు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.పండ్ల మార్కెట్ ని వెంటనే ఆపండి. మతోన్మాద శక్తులను రెచ్చగొడుతున్న రని ఆవేదన వ్యక్తంచేశారు ఇకపైన ఎవరైనా దేవాలయాల దగ్గర రాజకీయం చేస్తే సహించేది లేదు అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి బిఅరెస్ కార్యకర్తలకు సవాల్ విసిరారు.ఈ కార్యక్రమంలో తుక్కుగూడ మున్సిపాలిటీ చేర్మెన్ కంటేకార్ మధుమోహన్, కౌన్సిలర్లు, బిజెపి నాయకులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : 

  1. బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై మహిళా సర్పంచ్ సంచలన ఆరోపణలు..వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వొద్దంటూ విజ్ఞప్తి
  2. ఏప్రిల్ 30న తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం…
  3. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు… కోర్టులో పిళ్లై పిటిషన్ దాఖలు
  4. తల్లి తీర్చిదిద్దిన దొంగ… బాధితుల ఫిర్యాదుతో ఎట్టకేలకు తల్లీకొడుకులు అరెస్ట్

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.