
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కేసిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలపై జరుగుతున్న ప్రచారాన్ని కేసీఆర్ తిప్పికొట్టారు. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం డిసెంబర్‌లోనే ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలుండవని తేల్చేశారు. నేతలంగా ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ ఆదేశించారు. ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండాలని.. ఎమ్మెల్యేలంతా పాదయాత్రలకు ప్లాన్ చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఇప్పటి నుంచి 9 నెలల వరకు.. నియోజకవర్గాల వారిగా సమావేశాలు నిర్వహించుకోవాలని తెలిపారు.
Read Also : బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై మహిళా సర్పంచ్ సంచలన ఆరోపణలు..వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వొద్దంటూ విజ్ఞప్తి
నిత్యం ప్రజల్లో ఉండేలా ప్రణాళిక రచించుకోవాలని.. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఆగస్టు గానీ.. సెప్టెంబర్‌లో గానీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందన్న కేసీఆర్.. ఎవ్వరూ సమయాన్ని వృథా చేయకూడదని కేసీఆర్ ఆదేశించారు. ఏప్రిల్ 27న టీఆర్ఎస్ ప్లీనరీ అనేది జరపబోమని.. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఉంటుందని తెలిపారు. అయితే.. వరంగల్‌లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు నేతలకు కేసీఆర్ తెలిపారు. బీజేపీ చేస్తున్న ఆరోపణలను నేతలంతా తిప్పికొట్టాలని సీఎం కేసీఆర్ నేతలకు సూచించారు. ఎప్పటికప్పుడు బీజేపీ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వాలని సూచించారు. అన్ని నియోజకవర్గాలలో ప్రజాప్రతినిధులు సమీక్షలు నిర్వహించాలన్నారు.
Also Read : ఏప్రిల్ 30న తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం…
ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్తే.. మరోసారి గెలుపు మనదేనని కేసీఆర్ దీమా వ్యక్తం చేశారు. మరోవైపు.. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై కూడా సీఎం కేసీఆర్ స్పందించారు. రాబోయే రోజుల్లో ఇలాంటివి ఇంకా చూడాల్సి వస్తుందని నేతలకు గులాబీ బాస్ వివరించారు. ఇప్పటికే.. రాష్ట్రంలోని పలువురు మంత్రులు, కీలక నేతలపై దాడులు జరిగాయని గుర్తు చేసిన కేసీఆర్.. ఎలక్షన్లు దగ్గరపడే కొద్ది ఇలాంటి మరిన్ని జరిగే అవకాశముందని తెలిపారు. గంగుల కమలాకర్, రవిచంద్ర నుంచి ఇప్పుడు కవిత వరకు వచ్చారని పేర్కొన్నారు. ఎంత మంచిగా పని చేసినా బద్నాం చేస్తారని కేసీఆర్ అన్నారు. కడుపు కట్టుకుని ప్రజల కోసం పని చేయాలని సూచించారు.
ఇవి కూడా చదవండి :
- ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు… కోర్టులో పిళ్లై పిటిషన్ దాఖలు
- మనుషులు తాకారనే కారణంతోనే… పులి పిల్లల చెంతకు రాని పెద్ద పులి
- తల్లి తీర్చిదిద్దిన దొంగ… బాధితుల ఫిర్యాదుతో ఎట్టకేలకు తల్లీకొడుకులు అరెస్ట్
- నేడు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృతస్ధాయి సమావేశం… కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం