
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : ఏ తల్లి అయినా తన పిల్లలు గొప్పోళ్లు కావాలని కోరుకుంటుంది. తప్పుడు మార్గంలో వెళ్తుంటే మంచి మాటలు చెప్పో.. వినకపోతే శిక్షించో.. అది తప్పని చెప్పి.. సరైన మార్గంలో నడిపిస్తుంది. కానీ ఓ తల్లి మాత్రం తన కొడుకును దొంగగా తీర్చిదిద్దింది. దొంగతనాలు చేయమని పురిగొల్పింది. ఈ తల్లీకొడుకులు చేసిన దొంగతనాలు గురించి తెలిసి.. పోలీసులకే దిమ్మతిరిగిపోయింది. హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా కార్లు దొంగతనం జరుగుతూ ఉండడంతో.. ట్రావెల్ ఏజెన్సీ సంస్థలు పోలీసులను ఆశ్రయించారు.
Read Also : నేడు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృతస్ధాయి సమావేశం… కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
తమ వద్ద అద్దెకు తీసుకున్న కార్లు దొంగతనం జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు. అయితే.. ట్రావెల్స్ సంస్థల దగ్గర కార్లు అద్దెకు తీసుకొని వాటిని గుట్టు చప్పుడు కాకుండా మాయం చేస్తోన్న దొంగ మణిరాజ్‌ను జీడిమెట్ల పోలీసులు పట్టుకున్నారు. మణిరాజ్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేయగా విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. తన కన్నతల్లే కార్ల దొంగతనానికి పురికొల్పిందని మణిరాజ్ చెప్పటంతో.. అవాక్కవటం పోలీసుల వంతైంది. మణిరాజ్ అనే వ్యక్తి ట్రావెల్ సంస్థల దగ్గర కార్లు అద్దెకు తీసుకుంటాడు.
Also Read : ఢిల్లీలో కవిత దీక్ష ప్రారంభం… మద్దతు ప్రకటించిన 18 విపక్ష పార్టీలు
అనంతరం వాటిని పోలీసుల కంట పడకుండా రహస్యంగా ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తాడు. ఆ వచ్చిన డబ్బులతో తల్లీకొడుకులు ఎంజాయ్ చేస్తారు. ఈ విధంగా మణిరాజ్.. సంగారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో 9 కార్లు, జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో 8 కార్లు, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్క కారు దొంగలించి గుట్టు చప్పుడు కాకుండా ఏపీలోని పులివెందులలో నివాసం ఉంటున్న శంకర రెడ్డి అనే వ్యక్తికి అమ్మేశాడు. ఆయా పోలీస్ స్టేషన్‌లలో వరుసగా కేసులు నమోదు కావడంతో పోలీసులు రంగంలోకి దిగి.. మణిరాజ్‌తో పాటు అతని కన్నతల్లి ప్రేమలతను కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇవి కూడా చదవండి :
- ఢిల్లీలో కవిత దీక్షకు లైన్ క్లియర్… అనూహ్యంగా ధర్నా వేదికను మార్చుకున్న బీజేపీ
- ఢిల్లీ నడిబొడ్డున తెలంగాణ పరువు తీశారు… ఎమ్మెల్సీ కవితపై కిషన్ రెడ్డి ఫైర్
- తెలంగాణ సరిహద్దు లో ఎన్ కౌంటర్… పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం
- మోదీ సర్కార్ చేతిలో ఈడీ కీలు బొమ్మ, సీబీఐ తోలు బొమ్మ… మంత్రి కేటీఆర్
- ఇద్దరు యువతుల్ని పెళ్లి చేసుకున్న యువకుడు… ముహూర్తానికంటే ముందే పెళ్లి తంతు