
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : దేశంలో సంచలనం సృష్టిస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులివ్వటం.. రేపు ఆమె విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో.. అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయి ఐదు రోజులుగా ఈడీ కస్టడీలో ఉన్న హైదరాబాద్‌కు చెందిన వ్యాపార వేత్త అరుణ్ పిళ్లై.. కోర్టులో పిటిషన్ వేయటం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈడీకి తాను ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను ఉపసంహారించుకునేందుకు అనుమతివ్వాలంటూ రౌస్ అవెన్యూ కోర్టులో పిళ్లై పిటిషన్ దాఖలు చేశారు.
Read Also : మనుషులు తాకారనే కారణంతోనే… పులి పిల్లల చెంతకు రాని పెద్ద పులి
కాగా.. పిళ్లై పిటిషన్‌ను రౌస్ అవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించింది. పిళ్లై పిటిషన్‌లో ఈడీకి కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. అయితే.. అరుణ్ పిళ్లై.. తాను కవితకు బినామీనంటూ గతంలో ఈడీకి వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా.. ఆ వాంగ్మూలాన్ని ఇప్పుడు వెనక్కి తీసుకుంటున్నట్టు పిళ్లై పిటిషన్ దాఖలు చేయటం అసక్తికరంగా మారింది. అయితే.. అరుణ్ పిళ్లై ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే.. కవితను విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులకు స్పందిస్తూ.. రేపు విచారణకు కూడా హాజరుకానున్నట్టు తెలిపింది.
Also Read : తల్లి తీర్చిదిద్దిన దొంగ… బాధితుల ఫిర్యాదుతో ఎట్టకేలకు తల్లీకొడుకులు అరెస్ట్
ఈ విచారణలో.. అరుణ్ పిళ్లై, కవితను ఇద్దరినీ కలిపి అధికారులు ప్రశ్నించనున్నట్టు తెలిస్తోంది. ఈ క్రమంలోనే.. పిళ్లై ఈ పిటిషన్ వేయటం ఊహించని పరిణామంగా భావిస్తున్నారు. అయితే.. అరుణ్ పిళ్లైని అధికారులు అరెస్టు చేయగా.. ఐదు రోజుల నుంచి ఈడీ కస్టడీలోనే ఉన్నారు. అంతకు ముందు 29 సార్లు అరుణ్ పిళ్లై ఈడీ ఎదుట హాజరయ్యారు. ఇప్పటికే 11 సార్లు పిళ్లై వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు రికార్డు చేశారు. ఆ వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకునే.. ఈడీ అధికారులు కవితకు నోటీసులిచ్చారు. కాగా.. అనూహ్యంగా పిళ్లై వేసిన పిటిషన్‌తో తర్వాత ఏం జరగనుందన్నది ఉత్కంఠగా మారింది.
ఇవి కూడా చదవండి :
- నేడు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృతస్ధాయి సమావేశం… కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
- ఢిల్లీలో కవిత దీక్ష ప్రారంభం… మద్దతు ప్రకటించిన 18 విపక్ష పార్టీలు
- ఢిల్లీ నడిబొడ్డున తెలంగాణ పరువు తీశారు… ఎమ్మెల్సీ కవితపై కిషన్ రెడ్డి ఫైర్
- తెలంగాణ సరిహద్దు లో ఎన్ కౌంటర్… పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం
- మోదీ సర్కార్ చేతిలో ఈడీ కీలు బొమ్మ, సీబీఐ తోలు బొమ్మ… మంత్రి కేటీఆర్