
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. గురువారం విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేయగా.. కవిత కొంత సమయం కోరారు. ముందుగా షెడ్యూల్ చేసుకున్న కార్యక్రమాలు ఉన్నందున ఈ నెల 15న విచారణకు వస్తానని ఈడీకి లేఖ రాశారు. కానీ ఈ నెల 11న విచారణకు రావాలని ఈడీ కోరడంతో.. ఆ రోజు విచారణకు కవిత హాజరుకానున్నారు. శనివారం కవిత ఈడీ విచారణ ఉన్న నేపథ్యంలో ఏం జరగబోతుందనే ఉత్కంఠ బీఆర్ఎస్ వర్గాలతో పాటు టీ పాలిటిక్స్‌లో నెలకొంది. ఈ క్రమంలో శుక్రవారం తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ నిర్వహించిన కీలక సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Read Also : ఢిల్లీలో కవిత దీక్ష ప్రారంభం… మద్దతు ప్రకటించిన 18 విపక్ష పార్టీలు
ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా ఇప్పటికే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జెడ్పీ ఛైర్‌పర్సన్లు, డీసీసీబీ ఛైర్మన్లకు పార్టీ నుంచి ఆదేశాలు వెళ్లాయి. కవిత ఈడీ విచారణ నేపథ్యంలో దీనిపై ఈ సమావేశంలో చర్చించే అవకాశముందని తెలుస్తోంది. ఈడీ విచారణను ఎలా ఎదుర్కొవాలి? అనే అంశంపై చర్చించనున్నారు. అలాగే కవితను ఈడీ అరెస్ట్ చేయడం ఖాయమనే ఊహాగానాలు హల్‌చల్ చేస్తోన్నాయి. దీంతో కవితను అరెస్ట్ చేస్తే ఏం చేయాలి? తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలి? అనేది కూడా చర్చించనున్నట్లు టాక్ నడుస్తోంది.
Also Read : ఢిల్లీలో కవిత దీక్షకు లైన్ క్లియర్… అనూహ్యంగా ధర్నా వేదికను మార్చుకున్న బీజేపీ
ఒకవేళ కవితను అరెస్ట్ చేస్తే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. రాష్ట్రంతో పాటు దేశ రాజధాని ఢిల్లీలో కూడా కవిత అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేయాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అందుకు ఎలాంటి వ్యూహలు రచించాలనే దానిపై నేటి సమావేశంలో పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిరసనలు చేసేందుకు రూట్‌మ్యాప్ సిద్దం చేసే అవకాశముంది. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇతర అంశాలపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది.
ఇవి కూడా చదవండి :
- ఢిల్లీ నడిబొడ్డున తెలంగాణ పరువు తీశారు… ఎమ్మెల్సీ కవితపై కిషన్ రెడ్డి ఫైర్
- తెలంగాణ సరిహద్దు లో ఎన్ కౌంటర్… పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం
- మోదీ సర్కార్ చేతిలో ఈడీ కీలు బొమ్మ, సీబీఐ తోలు బొమ్మ… మంత్రి కేటీఆర్
- ఢిల్లీలో కవిత ప్రెస్‌మీట్… ధర్నా విషయంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు
- కొనసాగుతున్న ఆపరేషన్ మదర్ టైగర్… అటవి అధికారుల తీవ్ర ప్రయత్నం