
క్రైమ్ మిర్రర్, అమరావతి ప్రతినిధి : నంద్యాల జిల్లాలో కనిపించిన నాలుగు పెద్ద పులి పిల్లలను తల్లి చెంతకు చేర్చడానికి నాలుగు రోజులపాటు అటవీశాఖ అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 50 మందికిపైగా అటవీ అధికారులు, మొత్తం 300 మంది సిబ్బందితో పులి కూనలను తల్లి వద్దకే చేర్చడానికి చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. దీంతో గురువారం రాత్రి కూనలను తిరుపతిలోని వెంకటేశ్వర జూకు తరలించారు. వాటిని తిరిగి రెండేళ్ల తర్వాత నల్లమల అడవిలో వదిలిపెడతామని చెప్పారు. తల్లి పులి ఆరోగ్యంగానే ఉందని.. నల్లమల అటవీ ప్రాంతంలోనే సంచరిస్తోందని అధికారులు తెలిపారు. మనుషులు తాకారనే కారణంతోనే తల్లి పులి పిల్లల దగ్గరకు రావడానికి ఇష్టపడకపోయి ఉండొచ్చన్నారు.
Read Also : తల్లి తీర్చిదిద్దిన దొంగ… బాధితుల ఫిర్యాదుతో ఎట్టకేలకు తల్లీకొడుకులు అరెస్ట్
ఆత్మకూరు అటవీ డివిజన్లోని కొత్తపల్లి మండలం, పెద్ద గుమ్మడాపురం సమీపంలో నాలుగు పులి పిల్లలు ఉన్నట్లు సోమవారం ఉదయం గుర్తించారు. వాటిపై కుక్కలు దాడి చేసే ప్రమాదం ఉండటంతో.. ఓ గదిలో ఉంచిన గ్రామస్థులు, అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతం నుంచి దారి తప్పి వచ్చి ఉంటాయని అధికారులు భావించారు. అప్పటి నుంచి వాటిని తల్లి పులి వద్దకు చేర్చేందుకు ప్రయత్నాలు చేశారు. తల్లి పులి అన్వేషణ కోసం 40 ట్రాప్ కెమెరాలను ఉపయోగించారు. అడుగు జాడలను బట్టి పెద్ద పులి జాడను గుర్తించిన అటవీ శాఖ అధికారులు బుధవారం అర్ధరాత్రి పెద్దగుమ్మడాపురం సమీపంలోని అడవికి పిల్లలను తీసుకెళ్లారు.
Also Read : నేడు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృతస్ధాయి సమావేశం… కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
వాటిని ఎన్‌క్లోజర్‌లో ఉంచి తల్లి పులి రాక కోసం నిరీక్షించారు. కానీ అది అటు వైపు రాలేదు. పులి కూనలు భయంగా ఉండటాన్ని గమనించిన అధికారులు తిరిగి వాటిని బైర్లూటీలోని ఫారెస్ట్ గెస్ట్ హౌస్‌కు తీసుకొచ్చారు. ఈ పులి పిల్లల తల్లిని టి-108గా గుర్తించిన అధికారులు నల్లమల అడవుల్లోనే అది తిరుగుతోందన్నారు. పెద్దగుమ్మడాపురంతోపాటు ముసలిమడుగు గ్రామ పరిసరాల్లో అది సంచరిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. తల్లి పులి కోసం గాలింపు కొనసాగినన్ని రోజులు నాలుగు ఆడ పులికూనలను తిరుపతి జూపార్క్ పశువైద్యుల పర్యవేక్షణలో ఉంచి సపర్యలు చేశారు. వాటికి పాలు, సెరెలాక్‌తో పాటు చికెన్ లివర్ ముక్కలను ఆహారంగా అందించారు.
ఇవి కూడా చదవండి :
- ఢిల్లీలో కవిత దీక్ష ప్రారంభం… మద్దతు ప్రకటించిన 18 విపక్ష పార్టీలు
- గ్రామంలో ప్రత్యేక్షమైన పులిపిల్లలు… జనాల సెల్ఫీలు
- కొనసాగుతున్న ఆపరేషన్ మదర్ టైగర్… అటవి అధికారుల తీవ్ర ప్రయత్నం
- ఒకే ముహూర్తంలో ఇద్దరిని పెళ్లి చేసుకోనున్న యువకుడు… భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత పెళ్లి
- ఇద్దరు యువతుల్ని పెళ్లి చేసుకున్న యువకుడు… ముహూర్తానికంటే ముందే పెళ్లి తంతు