
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కల్వకుంట్ల కుటుంబం ప్రతినిధులు దశల వారీగా ప్రెస్‌మీట్లు పెడుతూ.. తాము నీతి మంతులమని చెప్పుకుంటున్నారని అన్నారు. తెలంగాణ సమాజం ఢిల్లీలో మద్యం వ్యాపారం చేయమని చెప్పిందా..? అని ప్రశ్నించారు. తెలంగాణ ఆడబిడ్డలు మద్యం వ్యాపారం చేయమని అడిగారా..? అని నిలదీశారు. ఢిల్లీ నడిబొడ్డున తెలంగాణ పరువు తీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై కిషన్ రెడ్డి ఢిల్లీలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
Read Also : తెలంగాణ సరిహద్దు లో ఎన్ కౌంటర్… పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం
‘అక్రమంగా వ్యాపారం చేసి తల దించుకునేలా చేశారు. లిక్కర్ వ్యాపారంలో ఎక్కడా కూడా రాజకీయ నాయకురాలి పేరు కనబడలేదు. తెలంగాణలో మద్యం వ్యాపారం ద్వారా.. ప్రజలను అనారోగ్యానికి గురి చేస్తున్నారు. మద్యాన్ని ప్రధాన అదాయంగా పెట్టుకున్నారు. అన్నాచెల్లెలు ఇద్దరు అబద్దాలు మాట్లాడారు. మహిళా రిజ్వేషన్ల కోసం ధర్నా చేస్తున్నందుకు ఈడీ నోటీసులు ఇచ్చారని చెబుతున్నా.. మహిళా రిజర్వేషన్ల గురించి అడిగే నైతిక హక్కు ఉందా..? మీ ఇంటి పార్టీ అయిన మజ్లిస్ పార్టీని మహిళా బిల్లు కోసం ఒప్పిస్తారా..? మహిళా బిల్లును పార్లమెంట్‌లో ఎస్పీ, ఆర్జేడీ కదా అడ్డుకుంది. మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టే దృష్టి మరల్చేందుకు కొత్త నాటకానికి కల్వకుంట్ల కుటుంబం తెర లేపింది. సానుభూతి కోసం చేస్తున్న డ్రామా ఇది.
Also Read : మోదీ సర్కార్ చేతిలో ఈడీ కీలు బొమ్మ, సీబీఐ తోలు బొమ్మ… మంత్రి కేటీఆర్
రాజ్యసభకు ఒక్క మహిళా ఎంపీని కూడా పంపని బీఆర్ఎస్‌కు రిజర్వేన్లపై మాట్లాడే హక్కు ఉందా..? ఆర్థిక మంత్రిగా తెలుగు ఆడబిడ్డకు మంత్రి వర్గంలో అవకాశం ఇచ్చారు. ఏకాభిప్రాయం వస్తే మహిళల హక్కులు కాపాడాలన్నది మా అభిప్రాయం..’ అని అన్నారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు ఒక చట్టం.. సామాన్యులకు ఒక చట్టం ఉంటుందా..? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈడీ ఎవరిని పిలుస్తోంది.. ఏం చేస్తుందనేది తమకు తెలియదన్నారు. కల్వకుంట్ల కుటుంబానికి ఉన్న సంపద సరిపోదని.. వ్యాపారం చేయమని తెలంగాణ సమాజం చెప్పిందా..? అని అడిగారు. అక్రమ వ్యాపారానికి తెలంగాణ సమాజానికి ఎలా లింక్ పెడతారని నిలదీశారు. నీతి వంతులు అయితే ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి :
- ఢిల్లీలో కవిత ప్రెస్‌మీట్… ధర్నా విషయంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు
- ఇద్దరు యువతుల్ని పెళ్లి చేసుకున్న యువకుడు… ముహూర్తానికంటే ముందే పెళ్లి తంతు
- ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల నామినేషన్ దాఖలు…
- ఎంఎల్‌సి కవిత లేఖపై స్పందించిన ఈడీ… 11న విచారణకు ఒకే
- కొనసాగుతున్న ఆపరేషన్ మదర్ టైగర్… అటవి అధికారుల తీవ్ర ప్రయత్నం