
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఢిల్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తలపెట్టిన దీక్షకు లైన్ క్లియర్ అయ్యింది. మహిళా రిజర్వేషన్ల కోసం కవిత.. రేపు జంతర్ మంతర్‌లో దీక్షకు పర్మిషన్ తీసుకోగా.. అదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కాంకు వ్యతిరేఖంగా బీజేపీ నేతలు కూడా ధర్నా చేసేందుకు తలచారు. దీంతో.. ఢిల్లీ పోలీసులు కవితకు షరతులు పెట్టిన విషయం తెలిసిందే. జంతర్ మంతర్‌లో సగం స్థలం మాత్రమే వాడుకోవాలంటూ.. ఢిల్లీ పోలీసులు కవితకు తెలియజేశారు. దీంతో.. కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దీక్ష కోసం ముందే పర్మిషన్ తీసుకుంటే.. పోలీసులు ఇలా చేయటం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also : ఢిల్లీ నడిబొడ్డున తెలంగాణ పరువు తీశారు… ఎమ్మెల్సీ కవితపై కిషన్ రెడ్డి ఫైర్
దీక్షకు సుమారు 5 వేల మంది వస్తారని ముందుగానే పోలీసులకు చెప్పి పర్మిషన్ తీసుకున్నామంటూ కవిత తెలిపారు. ఈ క్రమంలోనే.. బీజేపీ నేతలు కూడా పెద్ద ఎత్తున్న ధర్నాకు దిగేందుకు సిద్ధమవుతుండగా.. పోలీసులు అయోమయంలో పడ్డారు. తన దీక్షకు కవిత ఓ వారం రోజుల ముందే పర్మిషన్ తీసుకోవటంతో.. అటు పోలీసులు కూడా ఆలోచనలో పడ్డారు. దీంతో.. అనూహ్యంగా.. బీజేపీ తన నిర్ణయం మార్చుకుంది. జంతర్ మంతర్ నుంచి తమ ధర్నా వేదికను మార్చుకుంది. ధర్నాను దీన్‌దయాల్ మార్గ్‌లో చేయాలని నిశ్చయించుకుంది. దీంతో.. కవిత దీక్షకు లైన్ క్లియర్ అయినట్టైంది.
Also Read : తెలంగాణ సరిహద్దు లో ఎన్ కౌంటర్… పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం
మరోవైపు.. మహిళా గోస.. బీజేపీ భరోసా పేరుతో హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ దీక్ష చేయనున్నారు. పెరిగిన మద్యం షాపులు, బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా బండి సంజయ్ దీక్ష చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు విచారణలో భాగంగా.. కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈరోజు విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇవ్వగా.. తనకు రేపు దీక్ష ఉందని.. 11న విచారణకు వస్తానంటూ ఈడీకి కవిత లేఖ రాసింది. అయితే.. ఈ లేఖపై ఈడీ అధికారులు ఇంకా స్పందించక పోవటం గమనార్హం. రేపు పెద్ద ఎత్తున దీక్ష తలపెట్టిన నేపథ్యంలో ఈడీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
ఇవి కూడా చదవండి :
- మోదీ సర్కార్ చేతిలో ఈడీ కీలు బొమ్మ, సీబీఐ తోలు బొమ్మ… మంత్రి కేటీఆర్
- ఢిల్లీలో కవిత ప్రెస్‌మీట్… ధర్నా విషయంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు
- ఇద్దరు యువతుల్ని పెళ్లి చేసుకున్న యువకుడు… ముహూర్తానికంటే ముందే పెళ్లి తంతు
- ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల నామినేషన్ దాఖలు…
- ఎంఎల్‌సి కవిత లేఖపై స్పందించిన ఈడీ… 11న విచారణకు ఒకే