
క్రైమ్ మిర్రర్, మహేశ్వరం ప్రతినిధి : అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా మహేశ్వరం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కనిస్టేబుళ్లకు ఇన్స్పెక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలో శాలువలతో సన్మానించి చిరు బహుమానం అందచేసారు.ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ మహిళలంటే ఆబలలు కాదు సబలలని, మహిళలు కూడ అన్ని రంగాలలో పోటీ పడుతున్నారని అన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళలు కూడ ఉద్యోగం చేస్తూ తమ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళలకు రక్షణ కల్పిస్తున్నారని మహిళలపై జరుగుతున్న పరిణామాలను అరికడుతూ మేం ఉన్నామని ధైర్యాన్ని ప్రజల్లో అవగాహన కలిపిస్తూన్నారని తెలుపుతూ మహిళదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సిఐ మధుసూదన్ ఎస్సై నరసయ్య ఎస్సై సుబ్బారెడ్డి ఎస్ఐ మహేందర్ రెడ్డి కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
- వరంగల్‌లో మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాఠోడ్‌కు నిరసన సెగ..
- ఫోన్ మాట్లాడుతూనే కుప్పకూలిన యువకుడు… అక్కడికక్కడే మృతి
- సీఎం కేసీఆర్ ఓఎస్డీగా దేశపతి శ్రీనివాస్ రాజీనామా…
- ట్యాంక్‌బండ్ వద్ద వైఎస్ షర్మిల అరెస్ట్… బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలింపు