
క్రైమ్ మిర్రర్, భద్రాద్రి కొత్తగూడెం : వరుడు ఒక్కడే.. కానీ వధువులు ఇద్దరు. పెళ్లి ముహూర్తం కూడా ఒక్కటే. ఒకేసారి ఇద్దరి వధువులకు తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడు ఓ యువకుడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఎర్రబోరు గ్రామం ఈ వివాహానికి వేదికైంది. మేళతాళాలు బాజా భజంత్రీల మధ్య వైభవంగా ఈ వివాహం జరిగింది. బంధుమిత్రులు, గ్రామస్తుల సమక్షంలో వరుడు ఇద్దరు వధువులకు తాళి కట్టి అధికారికంగా తన జీవిత భాగస్వాములను చేసుకున్నాడు.
Read Also : ఒకే ముహూర్తంలో ఇద్దరిని పెళ్లి చేసుకోనున్న యువకుడు… భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత పెళ్లి
వివరాల్లోకి వెళ్తే… భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలంలోని ఎర్రబోరు గ్రామానికి చెందిన మడివి ముత్తయ్య, రామలక్ష్మి దంపతుల కుమారుడు సత్తిబాబు.. చదువుకునే సమయంలోనే స్వప్నకుమారి అనే యువతిని ప్రేమించాడు. కొన్ని కారణాల వలన వీరి వివాహం ఆలస్యం కావడంతో సహజీవనం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే వీరికి ఓ పాప పుట్టింది. ఆ తర్వాత కొద్దిరోజులు ఇద్దరూ విడిగా ఉండగా… ఆ సమయంలో సత్తిబాబుకు కుర్ణపల్లి గ్రామానికి చెందిన సునీతతో పరిచయం ఏర్పడి సహజీవనానికి దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న స్వప్నకుమారి ప్రియుడి ఇంటికి వెళ్లి పెద్దల ముందు పంచాయతీ పెట్టింది.
Also Read : కొనసాగుతున్న ఆపరేషన్ మదర్ టైగర్… అటవి అధికారుల తీవ్ర ప్రయత్నం
ఇద్దరు యువతులు తాము సత్తిబాబుతోనే ఉంటామని చెప్పడంతో పెద్దల అంగీకారంతో ముగ్గురూ కలిసి సహజీవనం సాగించారు. ఈ క్రమంలోనే స్వప్నకు ఓ బాబు పుట్టగా ప్రస్తుతం గర్భిణీగా ఉంది. అయితే వీరికి పెళ్లి చేయాలని నిర్ణయించిన పెద్దలు ముగ్గురి కుటుంబాల అంగీకారంతో గురువారం ఉదయం ఏడున్నర గంటలకు ముహూర్తం నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన వివాహ ఆహ్వాన పత్రిక సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో కుటుంబసభ్యులు ఉలిక్కిపడ్డారు. లీగల్‌గా ఏదైనా చిక్కులు వచ్చే అవకాశముందని భావించి ముహూర్తానికంటే ముందే బుధవారం రాత్రి గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి తంతు పూర్తి చేసేశారు. మొత్తానికి ఈ వివాహం తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
ఇవి కూడా చదవండి :
- ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల నామినేషన్ దాఖలు…
- ఎంఎల్‌సి కవిత లేఖపై స్పందించిన ఈడీ… 11న విచారణకు ఒకే
- మహేశ్వరం పొలీస్ స్టేషన్ల్ ఘనంగా మహిళా దినోత్సవం.. మహిళ పోలీసులను సన్మానించిన సి ఐ
- ఫోన్ మాట్లాడుతూనే కుప్పకూలిన యువకుడు… అక్కడికక్కడే మృతి
- వరంగల్‌లో మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాఠోడ్‌కు నిరసన సెగ..