
క్రైమ్ మిర్రర్, కరీంనగర్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవ కానుకగా తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ప్రకటించిన ఆరోగ్య మహిళ పథకాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కరీంనగర్ జిల్లాలో నేడు ప్రారంభించారు. మహిళల కోసం ఆరోగ్య మహిళ అనే కొత్త కార్యక్రమాన్ని తీసుకువచ్చామని ఈ పథకం మహిళల యొక్క ఆరోగ్య సంరక్షణకు ఉద్దేశించినదని, ఈ పథకం కింద 100 ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రం బుట్టి రాజారాం పట్టణ ఆరోగ్య కేంద్రంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి ఆరోగ్య మహిళ పథకాన్ని లాంచనంగా ప్రారంభించారు. అంతకు ముందు ఆరోగ్య మహిళ కిట్ ను, లోగోను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఒక మంచి కార్యక్రమం మన కరీంనగర్ లో ప్రారంభించుకున్నాం అని అన్నారు.
Read Also : తెలంగాణ గడ్డపై కాషాయం జెండా !… పక్కా వ్యూహాంతో ఎన్నికలకు కమలదళం
మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య మహిళ అనే కార్యక్రమం ప్రారంభించుకున్నామని, ప్రతి మహిళా అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు వాటిని చెక్ పెట్టేందుకు ఈ పథకం ప్రారంభించామన్నారు. ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా 8 రకాల వ్యాధులకు సంబందించిన ట్రీట్ మెంట్ లభిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదట 100 ఆరోగ్య మహిళా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. రానున్న రోజుల్లో వీటి సంఖ్య పెంచుతామన్నారు. ప్రతి మంగళవారం మహిళల కోసం ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. పెద్దపెద్ద ఆసుపత్రులలో చేసే అన్ని చికిత్సలు ఇక్కడ లభిస్తాయి అని తెలిపారు. ప్రతి ఒక్కరు ఇక్కడ వైద్య పరీక్షలు చేయించుకోవాలి అని సూచించారు. వచ్చే శ్రీరామ నవమి తరువాత న్యూట్రిషన్ కిట్ పథకాన్ని అమలు చేస్తాం అన్నారు. బిడ్డ కడుపులో పడగానే ఇచ్చే కిట్ న్యూట్రిషన్ కిట్ రక్తహీనత ను అరికట్టడానికి ఉపయోగపడుతుంది. గర్భిణీ మహిళలు 3 నుండి 4 ఇంకొకటి 7 నెలల గర్భిణీకి ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. మహిళల సంక్షేమం కోసం ఇప్పటికే కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలను అందిస్తున్న తెలంగాణ సీఎం ఇప్పుడు ఆరోగ్య మహిళ కార్యక్రమంతో మహిళల పక్షపాతిగా నిలిచారన్నారు.
Also Read : ప్రగతిభవన్‌కు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత… ఈడీ నోటీసులపై కేసీఆర్‌తో చర్చలు
మహిళల భద్రత కోసం దేశంలోనే ఎక్కడా లేని విధంగా షీ టీమ్స్ ని ఏర్పాటు చేశామని, మిషన్ భగీరథ ద్వారా ఆడబిడ్డలకు నీటి కష్టాలు తీర్చామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా నేడు అన్ని జిల్లాలలోనూ ఆరోగ్య మహిళ క్లినిక్ లను ఆయా జిల్లాలలోని స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రారంభిస్తున్నారు. వరంగల్ జిల్లా విషయానికి వస్తే మొత్తం వరంగల్ జిల్లాలో నాలుగు క్లినిక్లను ఏర్పాటు చేశారు. నేడు పర్వతగిరి మండలంలో ఆరోగ్య మహిళ ప్రాథమికఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ డాక్టర్ బి గోపి, స్థానికశాసనసభ్యులు ఆరూరిరమేష్ ప్రారంభించారు. మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహిళా క్లినిక్ లను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ గోపి పేర్కొన్నారు. కాగా నర్సంపేట నియోజకవర్గంలోని చెన్నారావుపేట మండలంలో స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య మహిళా క్లినిక్ ను ప్రారంభించారు.
Read Also : రోడ్డు ప్రమాదంలో పంచాయతీ కార్యదర్శి మృతి…
వరంగల్ నగరంలోని రంగశాయిపేట, కీర్తి నగర్ లలోనూ ఆరోగ్య మహిళ క్లినిక్ లను స్థానిక ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ నేడు ప్రారంభించారు. మహిళా క్లినిక్ ల ద్వారా మహిళలకు సంబంధించి సాధారణంగా 18 సంవత్సరాలు నిండిన స్త్రీలకు సాధారణ వ్యాధులు, గర్భాశయక్యాన్సర్, రక్తహీనత, మూత్రకోశ సంబంధిత వ్యాధులు , లైంగిక సంబంధమైన అంటువ్యాధులు, ఇన్ఫెక్షన్స్, అసహజమైన రుతుచక్ర సమస్యలు, శారీరక బరువు మేనేజ్మెంట్ పరీక్షలు చేసి వారికి అందుబాటులో ఉన్న వైద్యం చేసి, లేకుంటే రిఫరల్ ఆస్పత్రులకు పంపించి పూర్తి వైద్యం అందించడానికి ప్రణాళిక తయారు చేసి మహిళా ఆరోగ్యం పట్ల ఫోకస్ చేయనున్నారు. ప్రతి మంగళవారము ఓపి ద్వారా మహిళలు అనేక సమస్యలకు ఆయా క్లినిక్ లలో వైద్యాన్ని పొందవచ్చు. తెలంగాణ ప్రభుత్వం మహిళల ఆరోగ్యం కోసం ఇచ్చిన ఈ అవకాశాన్ని మహిళలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- ఒకే ముహూర్తంలో ఇద్దరిని పెళ్లి చేసుకోనున్న యువకుడు… భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత పెళ్లి
- తెలంగాణలో పూటకో హత్య, గంటకో రేప్… రేపిస్టులంతా బీఆర్ఎస్‌లోనే… బండి సంజయ్
- ప్రజలనే కాకుండా దేవుళ్ళను మోసం చేస్తున్న కేసిఆర్ కుటుంబం… రేవంత్ రెడ్డి
- కరవమని కుక్కలకు నేను చెప్పానా… మేయర్ విజయలక్ష్మి అసహనం