
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగేందుకు కొన్ని నెలల సమయం మాత్రమే ఇంది. ఈలోపు సీఎం కేసీఆర్ ముందుస్తుకు వెళ్లనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. తెలంగాణలో మూడోసారి అధికారంలోకి వచ్చి జాతీయ రాజకీయాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని సీఎం కేసీఆర్ భావిస్తుండగా.. ఈసారి ఎలాగైనా తెలంగాణలో జెండా పాతాలని కమలదళం ఉవ్విలూరుతోంది. అందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటాన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ చకచక పావులు కదుపుతోంది. అందుకు కాషాయ అగ్రనేతలను రాష్ట్రానికి రప్పించి.. పార్టీని పటిష్టం చేయాలని భావిస్తున్నారు.
Also Read : ప్రగతిభవన్‌కు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత… ఈడీ నోటీసులపై కేసీఆర్‌తో చర్చలు
అందులో భాగంగా ఈనెల 11న బీజేపీ అగ్రనేత, హోమంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాష్ట్రంలోని రెండు లోక్ సభ నియోజవర్గాల్లో పర్యటించనున్న అమిత్ షా.. ‘ప్రవాసీ యోజన కార్యక్రమం’లో పాల్గొననున్నారు. ఈనెలఖారులోగా ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా రాష్ట్ర పర్యటనకు రప్పించేందుకు తెలంగాణ బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే కాషాయం పార్టీ పక్కా వ్యూహాంతో ఎన్నికలకు వెళ్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆ అంశాలే వారికి తెలంగాణలో అధికారం కట్టబట్టే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. కాస్తా కష్టపడితే తెలంగాణలో గెలుపు పక్కా అని విశ్లేషిస్తున్నారు.
Read Also : ఒకే ముహూర్తంలో ఇద్దరిని పెళ్లి చేసుకోనున్న యువకుడు… భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత పెళ్లి
ఆ స్ట్రాటజీతోనే ఉహించని విధంగా క్రిస్టియన్లు మెజార్టీ ఉన్న మేఘాలయ, నాగాలాండ్తో పాటు త్రిపురలో అధికారంలోకి వచ్చారని.. అదే ఇక్కడా అమలు చేయనున్నట్లు చెబుతున్నారు. కమ్యూనిస్టులు కంచుకోటగా ఉన్నా బెంగాల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకున్నారని ఉదహరిస్తున్నారు. ఏమాత్రం ఆశలు లేని చోట కూడా అధికారంలోకి రావటమే బీజేపీకి ఉన్న ప్రత్యేకత అని.. దశబ్దాలుగా అదే వారికి ఉన్న అతి పెద్ద బలమంటున్నారు. బీజేపీ అన్ని పార్టీల మాదిరి కాదని.. దానికంటూ ప్రత్యేకంగా ఓ ఐడియాలజీ ఉంటుందని అంటున్నారు. పన్నా ప్రముఖ్, ఆర్ఎస్ఎస్, ప్రధాని మోదీ ఈ మూడే తెలంగాణలో బీజేపీలోని అధికారంలోకి తీసుకొచ్చేందుకు దోహదం చేస్తాయంటున్నారు.
Also Read : తెలంగాణలో పూటకో హత్య, గంటకో రేప్… రేపిస్టులంతా బీఆర్ఎస్‌లోనే… బండి సంజయ్
పన్నా ప్రముఖ్ పేరుతో బూత్ స్థాయిల్లో ప్రత్యేక ఆర్గనైజర్లను ఏర్పాటు చేసి ప్రజలతో మమేకమై.. ఓట్లను పొందే ప్రయత్నం చేస్తారన్నారు. ఆర్ఎస్ఎస్ కమిటెడ్ ఓట్లతో పాటు ఆర్ఎస్ఎస్కు ఉన్న జనరల్ కనెక్టివిటీ ద్వారా ( ఆర్ఎస్ఎస్లో కొనసాగుతున్న వారికి బయట వ్యక్తులకు ఉన్న మానవ సంబంధాలు), బీజేపీకి ఉన్న సంస్థాగతమైన ఓటర్లు, వీటితో పాటు మోదీకి ఉన్న ప్రత్యేక చరిష్మా. వీటితో తెలంగాణలో బీజేపీకి కోర్ ఓటింగ్ పెరుగుతుందని చెబుతున్నారు. ఈ అంశాలు కలిసొస్తే.. బీజేపీ తెలంగాణలో అధికారలోకి రావటం పెద్ద కష్టమేం కాదని.., దక్షిణ భారత దేశంలో కర్ణాటక తర్వాత తెలంగాణలో ఆ పార్టీ జెండా పాతటం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి :
- ప్రజలనే కాకుండా దేవుళ్ళను మోసం చేస్తున్న కేసిఆర్ కుటుంబం… రేవంత్ రెడ్డి
- కరవమని కుక్కలకు నేను చెప్పానా… మేయర్ విజయలక్ష్మి అసహనం
- చెరుకు సుధాకర్‌ను ఉద్దేశపూర్వకంగా ఫోన్‌లో తిట్టలేదు… కోమటిరెడ్డి వివరణ
- టిడిపి, జనసేన పొత్తులపై నారా లోకేష్ సంచలన వ్యాక్యలు…
- గ్రామంలో ప్రత్యేక్షమైన పులిపిల్లలు… జనాల సెల్ఫీలు