
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మళ్లీ అరెస్ట్ అయ్యారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల సమస్యలపై ఆమె ట్యాంక్‌బండ్ మధ్య మౌన దీక్షకు దిగారు. నల్ల బ్యాడ్జిలు ధరించి దీక్ష చేపట్టారు. సాయంత్రం వల్లకు దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. షర్మిల దీక్ష నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. శాంతి భద్రతల దృష్ట్యా దీక్షకు అనుమతి లేదంటూ షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బొల్లారం పోలీస్ స్టేషన్‌కు ఆమెను తరలించారు.
Read Also : తెలంగాణలో “ఆరోగ్య మహిళ” క్లినిక్ లు… కరీంనగర్ లో ప్రారంబించిన మంత్రి హరీష్ రావు
ఉమెన్స్ డేను పురస్కరించుకుని రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు, వేధింపులపై వైఎస్ షర్మిల పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ట్యాంక్‌బండ్‌పై ఉన్న రాణి రుద్రమదేవి విగ్రహం వద్ద దీక్ష చేపట్టారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అణిచివేతపై ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో మహిళలకు అసలు భద్రత లేదని ఆరోపించారు. మద్యానికి ఇచ్చిన విలువ కూడా మహిళల భద్రతకు కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వడం లేదని విమర్శలు కురిపించారు. ఏటా 25 వేల మంది అత్యాచారానికి గురవుతున్నారని ఆరోపించారు.
Also Read : రోడ్డు ప్రమాదంలో పంచాయతీ కార్యదర్శి మృతి…
ఈ క్రమంలో పోలీసులు షర్మిల దీక్షను భగ్నం చేశారు. ఆమెను అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్‌టీపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు షర్మిలను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ క్రమంలో కాసేపు ట్యాంక్‌బండ్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆ తర్వాత వైఎస్సార్‌టీపీ కార్యకర్తలను అక్కడ నుంచి పంపించి పరిస్థితిని పోలీసులు అదుపులోకి తీసుకొచ్చారు.
ఇవి కూడా చదవండి :
- తెలంగాణ గడ్డపై కాషాయం జెండా !… పక్కా వ్యూహాంతో ఎన్నికలకు కమలదళం
- ప్రగతిభవన్‌కు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత… ఈడీ నోటీసులపై కేసీఆర్‌తో చర్చలు
- ఒకే ముహూర్తంలో ఇద్దరిని పెళ్లి చేసుకోనున్న యువకుడు… భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత పెళ్లి
- చరిత్ర తిరగరాస్తుందా..! ఉచిత హామీలు ఊపిరి పోస్తుందా..!
- తెలంగాణలో లేటెస్ట్ సర్వే.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే!