
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ పరిణామం బీఆర్ఎస్ వర్గాలను టెన్షన్ పుట్టిస్తోంది. కవిత అరెస్ట్ లాంఛనమే అంటూ వార్తలు వస్తున్న వేళ బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తల్లో కలవరం మొదలైంది. ఈడీ నోటీసులపై చర్చించేందుకు ప్రగతిభవన్‌కు కవిత వెళ్లారు. నోటీసులపై ఎలా స్పందించాలి? విచారణలో అడిగే ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలి? అనే అంశాలను చర్చిస్తున్నట్లు చెబుతున్నారు. విచారణకు ఇప్పుడే హాజరుకావాలా? లేదా సమయం కోరారా? అనే విషయాలపై కేసీఆర్ సలహాలు తీసుకుంటున్నారు.
Read Also : ఒకే ముహూర్తంలో ఇద్దరిని పెళ్లి చేసుకోనున్న యువకుడు… భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత పెళ్లి
ఈడీ నోటీసుల నేపథ్యంలో కవితకు మద్దతు తెలిపేందుకు చాలామంది గులాబీ శ్రేణులు బంజారాహిల్స్‌లోని ఆమె ఇంటికి చేరుకుంటున్నారు. దీంతో కవిత ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఇంటి సమీపంలో భద్రతను మరింతగా పెంచారు. ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా కవిత ఇంటికి వెళ్లే రహదారులను పోలీసులు మూసివేశారు. ఎవరినీ కవిత ఇంటివైపు అనుమతించడం లేదు. మహిళా దినోత్సవం రోజు కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, 10న ధర్నా ఉంటే ఉద్దేశపూర్వకంగా నోటీసులు ఇచ్చిందని మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇక మహిళా దినోత్సవం రోజు కవితకు నోటీసులు ఇవ్వడం దారుణమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి :
- తెలంగాణలో పూటకో హత్య, గంటకో రేప్… రేపిస్టులంతా బీఆర్ఎస్‌లోనే… బండి సంజయ్
- ప్రజలనే కాకుండా దేవుళ్ళను మోసం చేస్తున్న కేసిఆర్ కుటుంబం… రేవంత్ రెడ్డి
- టిడిపి, జనసేన పొత్తులపై నారా లోకేష్ సంచలన వ్యాక్యలు…
- గ్రామంలో ప్రత్యేక్షమైన పులిపిల్లలు… జనాల సెల్ఫీలు
- చరిత్ర తిరగరాస్తుందా..! ఉచిత హామీలు ఊపిరి పోస్తుందా..!